రకుల్ అలా పాయల్ ఇలా.. ఊపిరాడటం లేదంటూ పోస్ట్.. ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ రచ్చ

ఒక్క సినిమా చాలు ఓవర్ నైట్ స్టార్‌ను చేసేయడానికి. అలా ఆర్ఎక్స్ 100తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్. ఒక్క సినిమాతో టాలీవుడ్‌ను తన వైపుకు తిప్పుకుంది. అయితే మళ్లీ ఇంత వరకు ఆ రేంజ్ హిట్ సినిమా పడలేదు. ఏదో చేశామా? అంటే చేసినట్టుగా అవకాశాలు వస్తున్నాయి. ఇందు లాంటి ఒక్క పాత్ర కూడా ఆమె దరికి చేరలేదు. వెండితెరపై అలా సాగుతున్న పాయల్.. సోషల్ మీడియాలో మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

స్టార్స్ సరసన నటించినా..

స్టార్స్ సరసన నటించినా..

మొదటి చిత్రంలోనే బోల్డ్ పాత్రలో కనిపించి అందర్నీ కట్టిపడేసింది పాయల్. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను కొట్టేసింది. ఏకంగా రవితేజ, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించే ఛాన్స్ దొరికింది. అయితే అందులో ఏ ఒక్క సినిమా కూడా పాయల్ కెరీర్‌కు తోడ్పడలేదు.

సోషల్ మీడియాలో హల్చల్..

సోషల్ మీడియాలో హల్చల్..

పాయల్ వెండితెరపై ఎంతగా అందాలు ఆరబోస్తుందో సోషల్ మీడియాలోనూ అంతే. ఆమె తన ఫాలోవర్స్‌ను ఎప్పుడూ నిరుత్సాహ పరచదు. నిత్యం హీటెక్కించే ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ మధ్య పిల్లో చాలెంజ్, పేపర్ చాలెంజ్ అంటూ వింత వింత డ్రెస్సులు ధరించింది.

 నమ్రతతో పోల్చుకుంది..

నమ్రతతో పోల్చుకుంది..

ఆ మధ్య పాయల్ తనను తాను నమ్రతా శిరోద్కర్‌తో పోల్చుకుంది. నమ్రత పాత సినిమాలోని ఓ స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయా.. అది నేనేమో అనుకున్నా కానీ తను నా ఫేవరేట్ అయిన నమత్ర శిరోద్కర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ ఫోటోను సరిగ్గా గమనిస్తే అది నిజమేనన్న భావన మనకు కూడా కలుగుతుంది.

Recommended Video

Deepika Padukone Pays Huge Salary For Her Bodyguard
ఊపిరి ఆడటం లేదు..

ఊపిరి ఆడటం లేదు..

కరోనావైరస్ భయంతో రకుల్ ప్రీత్ సింగ్ ఎలా ప్రయాణం చేసిందో అందరం చూశాం. పీపీఈ దుస్తులను ధరించి ఎంతో పకడ్బంధీగా ప్రయాణం చేసింది. రకుల్ తెలుపు దుస్తుల్లో వెళితే.. పాయల్ ఎరుపు దుస్తుల్లో బయలుదేరింది. ముంబైని మిస్ అవుతున్నానని చెబుతూ ఫేస్ మాస్క్ ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఊపిరి ఆడటం లేదని అసహనం వ్యక్తం చేసింది. తన డాక్టర్‌తో సహా బయలుదెరగా ఎయిర్ పోర్ట్‌లో ఫేస్ షీల్డ్ పెట్టుకుని నానా హంగామా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X