Payal Rajput: నేనేం స్టార్ కిడ్‌ను కాదు, అప్పుడు నెర్వస్‌గా ఉంటా.. అది సహజం
చన్నా మేరేయా అనే పంజాబీ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తర్వాత 2018లో ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. ఒక్కసారిగా టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సందర్భానాసారం అందాలను ప్రదర్శించే ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి తదితర చిత్రాల్లో అలరించింది. ఇక పలు ఫొటో షూట్లతో అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్‌పై ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే అవేవి పట్టించుకోకుండా హాట్ ఫొటోస్, సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది ఈ బోల్డ్ బ్యూటీ.
పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటించిన చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ చిత్రంలో స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో యంగ్ హీరో ఆది సాయికుమార్‌తో జోడి కట్టింది ఈ భామ. విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి తీస్ మార్ ఖాన్ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి నాటకం వంటి విభిన్న సినిమాను డైరెక్ట్ చేసిన కల్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. ఆగస్ట్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

''నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. నా చిత్రం విడదలయ్యే సమయంలో కొంచెం నెర్వస్‌గా ఫీల్ అవుతాను. అలా అందరికీ సహజంగానే ఉంటుంది. మా మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నింటికి విశేషస్పందన లభించింది. మా చిత్రానికి మీ ప్రేమ దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది కూడా మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా ఆగస్ట్ 19న మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తర్వాత నేను నటించిన చిత్రం థియేటర్లలోకి వస్తోంది. ఇది ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ చిత్రం. ఆది గారు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఆదితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది.
సాయి కార్తిక్ అందించిన సంగీతం, బీజీఎం, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. మీ అందరి సపోర్ట్ మాకు, మా చిత్రానికి కావాలి. సినిమాను అందరూ తప్పకుండా చూడండి. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ కల్యాణ్ జి గోగణ గారికి థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్‌కు సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. అందరూ సినిమాను కచ్చితంగా చూసి ఆదరించండి'' అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొంది పాయల్ రాజ్‌పుత్.
అలాగే తీస్ మార్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, సుధీర్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, సాయి కార్తిక్, డైరెక్టర్ కల్యాణ్ జి గోగణ, నిర్మాత నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొని వారి అభిప్రాయలను వెల్లడించారు.


Click it and Unblock the Notifications











