For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Payal Rajput: నేనేం స్టార్​ కిడ్​ను కాదు, అప్పుడు నెర్వస్​గా ఉంటా.. అది సహజం

  |

  చన్నా మేరేయా అనే పంజాబీ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హాట్​ బ్యూటీ పాయల్​ రాజ్​పుత్. తర్వాత 2018లో ఆర్​ఎక్స్​ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. ఒక్కసారిగా టాలీవుడ్​లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సందర్భానాసారం అందాలను ప్రదర్శించే ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్​ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి తదితర చిత్రాల్లో అలరించింది. ఇక పలు ఫొటో షూట్​లతో అందాలను హాట్​గా ఎక్స్​పోజ్​ చేసిన పాయల్​ రాజ్​పుత్​పై ట్రోలింగ్​ కూడా జరిగింది. అయితే అవేవి పట్టించుకోకుండా హాట్​ ఫొటోస్​, సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది ఈ బోల్డ్​ బ్యూటీ.

  పాయల్​ రాజ్​పుత్​ తాజాగా నటించిన చిత్రం తీస్ మార్​ ఖాన్​. ఈ చిత్రంలో స్టూడెంట్, రౌడీ, పోలీస్​గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో యంగ్​ హీరో ఆది సాయికుమార్​తో జోడి కట్టింది ఈ భామ. విజన్ సినిమాస్ బ్యానర్​పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి తీస్​ మార్​ ఖాన్​ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి నాటకం వంటి విభిన్న సినిమాను డైరెక్ట్​ చేసిన కల్యాణ్​ జి గోగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్​, సాంగ్స్​కు మంచి స్పందన లభించింది. ఆగస్ట్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్​లో భాగంగా బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హాట్​ బ్యూటీ పాయల్​ రాజ్​పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.​

  Payal Rajput Interesting Comments In Tees Maar Khan Pre Release Event

  ''నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. నా చిత్రం విడదలయ్యే సమయంలో కొంచెం నెర్వస్​గా ఫీల్​ అవుతాను. అలా అందరికీ సహజంగానే ఉంటుంది. మా మూవీ టీజర్​, ట్రైలర్​, సాంగ్స్​ అన్నింటికి విశేషస్పందన లభించింది. మా చిత్రానికి మీ ప్రేమ దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేనేం స్టార్​ కిడ్​ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది కూడా మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా ఆగస్ట్​ 19న మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తర్వాత నేను నటించిన చిత్రం థియేటర్లలోకి వస్తోంది. ఇది ఒక పవర్​ ప్యాక్డ్​ యాక్షన్​ చిత్రం. ఆది గారు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఆదితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది.

  సాయి కార్తిక్​ అందించిన సంగీతం, బీజీఎం, సాంగ్స్​ బాగున్నాయి. ఈ సినిమాలో ట్విస్ట్​లు అద్భుతంగా ఉంటాయి. మీ అందరి సపోర్ట్​ మాకు, మా చిత్రానికి కావాలి. సినిమాను అందరూ తప్పకుండా చూడండి. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్​ కల్యాణ్​ జి గోగణ గారికి థ్యాంక్స్​. మా ప్రొడ్యూసర్​కు సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్​ ఉంది. అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. అందరూ సినిమాను కచ్చితంగా చూసి ఆదరించండి'' అని ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పేర్కొంది పాయల్​ రాజ్​పుత్​.

  అలాగే తీస్​ మార్​ ఖాన్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో ముఖ్య అతిథులుగా అడవి శేష్​, సిద్ధు జొన్నలగడ్డ, సుధీర్​ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్​, సాయి కార్తిక్, డైరెక్టర్​ కల్యాణ్​ జి గోగణ, నిర్మాత నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్​ అయ్యంగార్​ పాల్గొని వారి అభిప్రాయలను వెల్లడించారు.

  English summary
  Payal Rajput Interesting Comments In Aadi Sai Kumar Starrer Tees Maar Khan Pre Release Event Says Im Not A Star Kid
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X