For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కలియుగం అంతం అయిపోయింది..సత్యయుగం వచ్చేసింది.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన పాయల్ !

  |

  ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ యూత్ ను తన వైపు తిప్పుకుంది. తొలి సినిమాతోనే ఈ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. అయినా సరే ఎక్కడా తగ్గని ఈ భామ వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. అయితే ఆమె తాజాగా వేదాంతం మాట్లాడుతూ ఒక పోస్ట్ పెట్టింది. అంతా కాక దానికి సంబంధించి ప్రూఫ్ లు కూడా పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

  శృంగారపు ఫోజులతో నైనా గంగూలీ అలజడి.. వైరల్‌గా ఫోటోలు

  ఇందు క్రేజ్

  ఇందు క్రేజ్

  ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు వారికి పాయల్ రాజ్ పుత్ బాగా దగ్గరైంది. ఈ సినిమా ఆమెకు ఫస్ట్ మూవీ అయినా కూడా ఏ మాత్రం బెదురు లేకుండా హీరోతో రొమాంటిక్ సీన్స్ లో నటించమంటే జీవించేసింది. ఒక రేంజ్ లో అందాలు ఆరబోసి బోల్డ్ రోల్ లో మెప్పించింది ఈ పంజాబీ బ్యూటీ. అలా మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసి గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని సిగ్నల్ ఇచ్చేసింది.

  తెలుగే ముద్దు

  తెలుగే ముద్దు

  ఈ భామ తెలుగు కంటే ముందే తమిళ్ లో 2013లో పంజాబీలో 2017 లో ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు భాషల్లోనూ కలిసిరాలేదు. ఆ తరువాత 2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలో, ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత ఆమె బాలయ్య తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో కూడా నటించి మెప్పించింది.

  అవకాశాలు కోసం

  అవకాశాలు కోసం

  ఆ తర్వాత మరో రెండు మూడు సినిమా అవకాశాలు దక్కాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పిన ఆర్డీఎక్స్ లవ్ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన వెంకీ మామ సినిమాలో ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత డిస్కో రాజా అనే సినిమా చేసినా అది పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఇక ఆహా కోసం అనగనగా ఒక అతిథి అనే సినిమా చేయగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

  ఆమె మృతితో

  ఆమె మృతితో

  తాజాగా ఈ భామ ప్రేమిస్తున్న సౌరభ్ దింగ్రా తల్లి మృతితో ఆమె మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆమె మరణం తనను ఎంతో బాధిస్తోందని ఆమె వెల్లడించింది. పాయెల్ ఎంతగానో ప్రేమించే అనిత దింగ్రా కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్న ఆమె నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు అంటూ ఆమె ఎమోషనల్ అయింది.

  సత్య యుగం

  సత్య యుగం

  ఇక "సత్య యుగం" వచ్చిందని పేర్కొన్న ఆమె ఆదివారం వచ్చిందన్న ఉత్సాహం లేదు, సోమవారం ఉదయం అనే టెన్షన్ లేదు, డబ్బు సంపాదించడానికి దురాశ లేదు, ఖర్చు చేయాలనే కోరిక లేదు, రెస్టారెంట్‌లో తినడానికి ఉత్సాహం లేదు, ప్రయాణంలో ఆనందం లేదు, బంగారం లేదా వెండి మీద మోహం లేదు, ఇంక్రిమెంట్ మీద కోరిక లేదు, యజమాని ఇచ్చేది అందుకున్నందుకు సంతోషంగా ఉంది, కొత్త బట్టల కోసం ఆసక్తి లేదు, చదువు గురించి కంగారు లేదు, ఇక మనం మోక్షానికి చేరుకున్నామా? కలియుగం ముగిసిందని, సత్య యుగం వచ్చిందని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలని ఆమె ప్రశ్నించింది.

  Pavala Syamala కు నిత్యావసర సరుకులు ఇచ్చి సహాయం అందించిన TV ఆర్టిస్టులు !!

  కల్కి అవతార్? కోవిడ్ ఏనా

  మనం mana చుట్టూ పక్కల వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నామని పేర్కొన్న ఆమె కాలుష్య రహిత వాతావరణాన్ని సాధించామని, రేసులా పరిగెడుతున్న జీవితానికి బ్రేకులు పడ్డాయని,కొత్త సాధారణ జీవితం ప్రశాంతంగా మరియు సంతృప్తి కరంగా ఉంటోందని పేర్కొంది. అందరూ సాధారణ ఆహారం తింటున్నారని, సమానత్వం వచ్చిందని పేర్కొంది. పని వాళ్ళు లేరు, అందుకే అందరూ ఇంట్లో కలిసి పనిచేస్తున్నారు, డిజైనర్ దుస్తులను ఎవరూ ధరించడం లేదు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్మరించుకుంటున్నారు, ఇంకా సజీవంగా ఉన్నందుకు వారి ఆశీర్వాదాలు ఉన్నట్టేనని భావిస్తున్నారని పేర్కొంది.

  అహంకారం పోయింది, ప్రజలు సహకరిస్తున్నారు, పిల్లలు పని ప్రదేశాల నుండి తమ ఇళ్లకు వచ్చి తల్లిదండ్రుల దగ్గర నివసించడం ప్రారంభించారని పేర్కొన్న అఆమే సత్యయుగం కాకపోతే ఇంకేముంది?, ఇంకా కల్కి అవతార్? కోవిడ్ ఏనా ? అంటూ ఆమె కామెంట్ చేసింది.

  English summary
  As the second wave of coronavirus is cracking down the nation, all the states went into lockdown. now payal rajputh made someintresting comments on this stating satyayugam has came.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X