For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ప్రదేశంలో పాయల్ ముద్దులాట.. పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే!! నెట్టింట వైరల్ పిక్స్

  |

  యంగ్ హీరోయిన్, పాల బుగ్గల పాయల్ ముద్దులాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన పిక్స్ తెగ హంగామా చేస్తున్నాయి. పైగా తన ముద్దులాటను, ఆ ముచ్చటను ఆమెనే స్వయంగా బయటపెట్టడం జనాల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది. ఇంతకీ పాయల్ ముద్దులాట ఎక్కడ జరిగింది? అది ఎవరితో..? వివరాల్లోకి పోతే..

  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ పాయల్

  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ పాయల్

  Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనతికాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది పాయల్ రాజ్‌పుత్. పాత్ర పరిధి ఎంతనేది చూడకుండా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

  బోల్డ్ క్యారెక్టర్.. పాయల్ కోసం వెయిటింగ్

  బోల్డ్ క్యారెక్టర్.. పాయల్ కోసం వెయిటింగ్


  తన డెబ్యూ మూవీ Rx100లో బోల్డ్ క్యారెక్టర్ చూపిస్తూనే నటనా పరంగా తన సత్తా ఏంటో చూపించింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. పాయల్ డేట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

  యూత్‌ని బుట్టలో వేసుకొని.. అందాలు ఆరబోస్తూ!

  యూత్‌ని బుట్టలో వేసుకొని.. అందాలు ఆరబోస్తూ!

  RDX లవ్ అంటూ రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ కుర్రకారు కంటిపై కునుకు లేకుండా చేసింది పాయల్. ఈ సినిమాతో యూత్ అంతా ఆమె బుట్టలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'వెంకీ మామ' రూపంలో సక్సెస్ ఖాతాలో వేసుకొని జోష్ కొనసాగిస్తోంది ఈ బ్యూటీ.

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా!!

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా!!

  తెలుగుతో పాటు హిందీ అలాగే తన మాతృభాష పంజాబీ లోనూ సినిమాలు చేస్తూ సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే రవితేజ సరసన 'డిస్కో రాజా' సినిమాలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది.

  రియల్ లైఫ్‌లో ప్రేమ.. ముద్దాడుతూ!

  రియల్ లైఫ్‌లో ప్రేమ.. ముద్దాడుతూ!

  ఇకపోతే తన రియల్ లైఫ్‌లో జంతువుల పట్ల కూడా తనకు అమితమైన ప్రేమ ఉందని నిరూపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది పాయల్. ఈ ఫొటోల్లో బుల్లి శునకాన్ని ముద్దాడుతూ కనిపించింది.

  కుటుంబం పెద్దదైంది అంటూ

  కుటుంబం పెద్దదైంది అంటూ

  ఈ మేరకు తన కుటుంబం పెద్దదైందని, తన ఫ్యామిలీలో నాలుగు అడుగులు పడ్డాయని పేర్కొన్న పాయల్.. తన బుజ్జి పప్పీ పేరు ''కాండీ'' అని తెలిపింది.

  పబ్లిక్ కిస్సులు.. ఆ ప్రదేశంలో అలా!

  పబ్లిక్ కిస్సులు.. ఆ ప్రదేశంలో అలా!


  ఆ బుజ్జి పప్పీ కాండీకి పబ్లిక్ గానే ఎయిర్‌పోర్ట్‌లో కిస్సులు పెట్టేసింది పాయల్. ముద్దుగా ముద్దు పెడుతున్న సమయంలో కెమెరాలు క్లిక్ కొట్టాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ''సూపర్ కిస్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  అస్సలు వెనకాడను.. దానికి ఓకే

  అస్సలు వెనకాడను.. దానికి ఓకే


  మరోవైపు కెమెరా ముందు లిప్ కిస్ సీన్స్ చేసేందుకు తాను అస్సలు వెనుకాడనని ఇప్పటికే స్పష్టం చేసింది పాయల్. ముద్దు సీన్లు, బోల్డ్ సన్నివేశాలలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా నటించడమే కాకుండా అలాంటి వాటి గురించి ముందే తన తల్లితో స్వేచ్చగా చర్చిస్తానని కూడా ఆమె చెప్పింది.

  Ravi Teja Silent In Disco Raja Movie Success Press Meet || Filmibeat Telugu

  నరేంద్ర అంటున్న పాయల్

  ప్రస్తుతం జయంత్‌.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''నరేంద్ర'' చిత్రంలో పాయల్ నటిస్తోంది. ఇందులో ఆమె పోషిస్తున్న రోల్ విలక్షణంగా ఉండనుందట. అలాగే 5Ws సినిమాలో కూడా నటిస్తోంది పాయల్.

  English summary
  Payal Rajputh recently paired with Mass Maha Raja Raviteja and recently she says about bold seens in her movies. Now she spotted in airport with kissing movements.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X