Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
మరోసారి రెచ్చిపోయిన పాయల్.. స్టేజ్ మీదే ప్రియుడికి ఘాటు లిప్ లాక్
తెలుగు వారికి పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు చేసిన మొదటి సినిమాతోనే బోల్డ్ అని పేరు తెచ్చుకున్న ఆమె తర్వాత కూడా అనేక సినిమాల్లో బోల్డ్ పాత్రలకే పరిమితమవుతూ వచ్చింది. అయితే తెలుగులో ప్రస్తుతానికి ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు కానీ వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చేసుకుంటూ వెళుతోంది. మొన్నీమధ్య తన ప్రియుడిని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ భామ తాజాగా ఒక ఈవెంట్ లో అతనికి లిప్ లాక్ ఇస్తూ షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

సైరత్ పంజాబీ రీమేక్
ఢిల్లీలో పుట్టిన పాయల్ రాజ్ పుత్ తన కెరీర్ ని మొదట టెలివిజన్ రంగం ద్వారా ప్రారంభించింది. దాదాపు మూడు నాలుగు సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటించిన ఆమె తర్వాత మొట్టమొదటిసారిగా 2017 వ సంవత్సరంలో పంజాబీ సినీ పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. మరాఠీ సినిమా సైరత్ పంజాబీ రీమేక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అయితే ఆమెకు ఈ సినిమా పెద్దగా పేరు తీసుకు రాలేదు.

సినిమాలతో బిజీ బిజీగా
కానీ ఆ తర్వాత హిందీలో మరో సినిమా చేసింది ఆ సినిమా కూడా పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ ఎప్పుడైతే తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిందో ఆ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావడమే కాక వరుస అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. అలా ఆమె పంజాబీ తెలుగు సినిమాలతో బిజీ బిజీగా గడిపేసింది.

సోషల్ మీడియా వేదికగా
అయితే తెలుగులో ఎన్ని సినిమాలు చేస్తున్న ఆమెకు కలిసి రాక పోవడంతో తమిళ సినీ పరిశ్రమ నుంచి ఆఫర్ రావడంతో దాన్ని కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఆమె ఒక సినిమా చేస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సౌరభ్ దింగ్రాతో
జీ తెలుగు వారు నిర్వహిస్తున్న ''జీ మహోత్సవం'' షోలో తన డాన్స్ తో అదరగొట్టింది పాయల్. అంతే కాదు తన పార్టనర్‌కి లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఈ భామ ప్రస్తుతం సౌరభ్ దింగ్రాతో పీకల లోతు ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని వారు పలు సందర్భాల్లో ఫొటోలు, వీడియోల ద్వారా తమ రిలేషన్‌ను తెలియజేస్తూనే రాగా సందర్భాల్లో కలిసి ఘాటు ఫోటోలు వదిలారు కూడా. ఇక తాజాగా మరోసారి పాయల్ సౌరభ్‌తో తనకు ఉన్న ఉన్న అనుబంధాన్ని అర్ధమయ్యేలా చేసింది.

లిప్ లాక్
డ్యాన్స్ ముగిసిన అనంతరం నీ మెడలో బేబ్ అని ఎందుకు ఉందొ తెలిసింది, ఆయన బేబీ అని పిలిస్తాడు కదా అని ప్రశ్నిస్తే సిగ్గుపడుతూ అతనికి లిప్ లాక్ ఇస్తుంది. ఇక ఈ వీడియో ప్రోమో యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం ''5Ws, కిరాతక, గోల్ మాల్, తీస్ మార్ ఖాన్, హెడ్ బుష్' చిత్రాల్లో నటిస్తోంది.