Mangalavaaram: ఒంటిపై నూలుపోగు లేకుండా పాయల్.. RX100 డైరెక్టర్‌తో బోల్డుగా!
సంచలన పాత్రతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. సక్సెస్ రేటు ఆశించిన రీతిలో లేకపోయినా.. హవాను మాత్రం చూపిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ 'మంగళవారం' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఆమె నగ్నంగా కనిపించింది. మరి ఆ పోస్టర్‌ను మీరే చూసేయండి మరి!

ఒకే మూవీతోనే సంచలనం: పంజాబీలో సినిమాలు చేస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్న పాయల్ రాజ్‌పుత్ RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయింది. దీంతో ఇది సక్సెస్ అవడంతో పాటు పాయల్‌కు టాలీవుడ్‌లో మంచి ఆరంభం లభించింది. ఫలితంగా ఈ బ్యూటీ సంచలనంగా మారి అందరి దృష్టిలో పడిపోయింది.
అప్పటి నుంచి వరుసగానే: మొదటి చిత్రంతోనే హాట్ టాపిక్ అయిపోయిన పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఇలా ఆరంభంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్ చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించి క్రేజ్ పెంచుకుంది.

డిజాస్టర్లు.. అయినా బిజీగా: టాలీవుడ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండు చిత్రాలు భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. దీంతో పాయల్‌కు తెలుగులో ఆఫర్లు తగ్గినా.. వేరే భాషల్లో మాత్రం వసూనే ఉన్నాయి.
అజయ్‌తో మంగళవారం: కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తనకు RX100తో గ్రాండ్ ఎంట్రీని అందించిన అజయ్ భూపతితో చేతులు కలిపింది. వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీకి 'మంగళవారం' అనే టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు.

సౌత్ ఇండియా రేంజ్‌లో: RX100తో దర్శకుడిగా మంచి ఆరంభాన్ని అందుకున్న అజయ్ భూపతి.. ఆ తర్వాత 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ మూవీ చేశాడు. అయితే, ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంలో విఫలం అయింది. దీని తర్వాత గ్యాప్ తీసుకున్న అజయ్ ఇప్పుడు పాయల్‌తో 'మంగళవారం' చేస్తున్నాడు. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు.

నగ్నంగా పాయల్ పోస్టర్: క్రేజీ కాంబినేషన్‌లో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టుతో రాబోతున్న 'మంగళవారం' మూవీకి సంబంధించిన పాయల్ రాజ్‌పుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా దర్శనమిచ్చింది. వెనుక నుంచి మొత్తం చూపిస్తూ కవ్విస్తోంది. దీంతో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











