బోల్డ్ పాత్రలో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్!

By Bojja Kumar

'ఆర్ఎక్స్ 100' సినిమాలో బోల్డ్‌గా నటించడంతో పాటు నెగెటివ్ క్యారెక్టర్ పోషించిన పాయల్ రాజ్‌పుత్ ఆ సినిమాతో టాలీవుడ్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. దీని తర్వాత ఆమెను వరుస ఆఫర్లు వరించాయి. కొన్ని సినిమాలకు ఆమె ఓకే చేసింది కూడా.

నెక్ట్స్ మూవీ గురించి పాయల్ మాట్లాడుతూ... 'ఆర్ఎక్స్ 100 తర్వాత తాను మూడు సినిమాలను ఫైనలైజ్ చేశాను, అందులో అందులో ఒకటి భాను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు మూవీ కూడా ఉంది. ఆర్ఎక్స్ 100 మూవీలో నేను చేసిన పాత్రకు పూర్తి విరుద్ధమైన పాత్ర చేస్తున్నాను.' అని తెలిపారు.

Payal Rajput next movie with director Bhanu Shankar

ఈ సినిమాలో కూడా తన పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని, అదే సమయంలో ఛాలెజింగ్‌గా ఉంటుంది అని పూనమ్ స్పష్టం చేశారు. మీరు ఇందులో కొత్త పాయల్‌ను చూస్తారని తప్పకుండా చెప్పగలను అన్నారు.

ప్రస్తుత కాలంలో ఎవరి బిజీ వారిది... ఇతరుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలాంటిది కాదు. న్యాయం ఎటు వైపు ఉంటే అటు వైపు నిల్చునే తత్వం. గుండాలు, మినిస్టర్లు ఉన్నా లెక్క చేయదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తన గళం విప్పే పాత్రలో నటిస్తున్నాను అని పూనమ్ వెల్లడించారు.

ఇలాంటి పాత్ర నాకు రావడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూస్తున్నాను. అయితే ఈ సినిమాలో హీరో పాత్ర ఇంకా ఫైనల్ కాలేదు. సెప్టెంబర్ చివర్లో సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అందుకోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X