ప్లాప్ ఇచ్చిన హీరోతోనే మరో సినిమా.. పాయల్ ఈసారైనా సక్సెస్ అవుతుందా?
Rx100 సినిమాతో సైలెంట్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా కూడా సైలెంట్ గానే వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇకపోతే ఆ సినిమా తరువాత పాయల్ అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి.
డిస్కో రాజా, వెంకీ మామ సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్న ఈ బ్యూటీ మంచి సక్సెస్ అందుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ సినిమాలు ఊహించని ఫలితాన్ని అందుకోవడంతో పాయల్ క్రేజ్ తగ్గుతోందనే కామెంట్స్ వచ్చాయి. ఈ సమయంలో అమ్మడు తనకు ప్లాప్ ఇచ్చిన హీరోతోనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఆ హిరో మరెవరో కాదు. మాస్ మహారాజా రవితేజ. డిస్కో రాజా సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ క్రాక్ సినిమాలో కూడా పాయల్ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాలో మెయిన్ లీడ్ లో శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఇప్పుడు మరో ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు గోపిచంద్ మలినేని పాయల్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా పాయల్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











