For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యవ్వారమంతా బయట పెట్టిన పాయల్.. అతనితో గడిపిన క్షణాలు గుర్తుచేసుకుంటూ!

  |

  పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరు ఒక తెలుగు నాట ఓ సంచలనం. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందు పాత్రలో అద్భుతంగా నటించి కుర్రాళ్లను మతులు పోగొట్టింది. పాయల్ అందాలు చూసి యూత్‌కు చలి జ్వరం వచ్చినంత పనైంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌ను తన వశం చేసుకున్న పాయల్.. మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయింది. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వ్యక్తి గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

  కలిసి రాని చిత్రాలు..

  కలిసి రాని చిత్రాలు..

  ఆర్‌ఎక్స్ 100లో పాయల్ క్రియేట్ చేసిన మ్యాజిక్ మరో చిత్రంతో చేయలేకపోయింది. ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో మరోసారి మెప్పించేందుకు వచ్చినా కూడా ఆమెకు కలిసిరాలేదు. ఆపై వచ్చిన వెంకీ మామ మూవీ విజయం సాధించినా.. పాయల్‌కు పేరు రాలేదు. రీసెంట్‌గా వచ్చిన డిస్కోరాజా పరిస్థితీ అంతే. ఇలా ఏ సినిమా కూడా పాయల్‌కు పేరు తెచ్చిపెట్టడం లేదు.

  ఒక్కరాత్రిలో వచ్చింది కాదు..

  ఒక్కరాత్రిలో వచ్చింది కాదు..

  తనకు ఇప్పుడు క్రేజ్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదనీ.. తాను మోడలింగ్, సినీ రంగంలో దాదాపు ఆరేళ్ల నుంచి శ్రమించానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో చాలా ప్రయత్నాలు చేశానని, అయితే ఒక్క అవకాశం కూడా రాలేదని.. ఎంతో కష్టపడితే గానీ నేడు ఈ స్థానం తనకు లభించలేదని ఆ మధ్య చెప్పుకొచ్చింది.

  పంజాబీలో ఫేమస్..

  పంజాబీ ఇండస్ట్రీలో తనకు ఫుల్ క్రేజ్ ఉందని, ధడక్ పంజాబీ రీమేక్‌లో తాను నటించానని తెలిపింది. అందరూ తనను ఆ సినిమాలోని క్యారెక్టర్‌తోనే పిలుస్తారని, అయితే టాలీవుడ్‌కు వచ్చాక అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారని తెలిపింది. ఇక పంజాబీలో నటించరా? అని పదే పదే అడుగుతుంటారని అంది. అలా యువతరంలో అంతటి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ కుర్రహృదయాలను కాల్చేసే ప్రకటన ఒకటి చేసింది.

   బర్త్ డే విషెస్ చెబుతూ..

  బర్త్ డే విషెస్ చెబుతూ..

  ‘నా తప్పొప్పులను ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకంటే మిన్నైనా వారు ప్రపంచంలో ఇంకెవరూ లేరు..మనం కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంతో భద్రంగా గుండెల్లో దాచుకుంటాను.. నా జీవితంలోని నువ్వు తీసుకొచ్చిన సంతోషం, ప్రశాంతతకు నేనెప్పుడు కృతజ్ఞారాలినే. హ్యాపీ బర్త్ డే మేరీ జాన్' అంటూ పోస్ట్ చేసింది.

  గుండెల్ని పగలగొట్టావ్..

  గుండెల్ని పగలగొట్టావ్..

  ఇక ఈ పోస్ట్‌ను పాయల్ వీరాభిమానులు తెగ ఫీలవుతున్నారు. కొందరేమో అర్థంగాక.. అతను నీ బాయ్‌ఫ్రెండా?, మీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు.. దిల్ టూట్ గయా (గుండెల్ని పగలగొట్టావ్) అంటూ ఏడ్చేస్తున్నారు.

  English summary
  Payal Rajput Post About Her Relationship With Saurabh Dhingra. Happy bday to the only person that’s capable of loving my imperfections No one will be ever as precious to me as you are . I cherish every moment we spend together,m forever grateful for the happiness and peace you brought into my life . Happy birthday mere jaan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X