రవితేజతో ఫొటో షేర్ చేసిన పాయల్.. రహస్యం బయటపడిపోయినట్లేనా.!
'RX 100' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో చేసింది బోల్డ్ క్యారెక్టరే అయినప్పటికీ, తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీని తర్వాత ఎన్నో సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసింది. ఇలా.. సినిమాలు, స్పెషల్ సాంగులతో బిజీ బిజీగా గడుపుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.
అందంతో తెలుగు కుర్రాళ్లను తన వైపునకు తిప్పుకున్న పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తోన్న 'వెంకీ మామ' సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. అలాగే, రవితేజ హీరోగా నటిస్తోన్న 'డిస్కోరాజా' సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఇలా రెండు భారీ సినిమాలలో భాగం అయిన పాయల్.. తాజాగా ఓ సీక్రెట్‌ను రివీల్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోనే అని ప్రచారం జరుగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. పాయల్ రాజ్‌పుత్.. రవితేజతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో రవితేజ లుక్ కొంత స్పెషల్‌గా ఉంది. దీంతో ఇందులో రవితేజ కనిపించేది 'డిస్కోరాజా' లుక్‌లోనేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ఫొటోను పాయల్ షేర్ చేయడంతో చర్చ మొదలైంది. అయితే, ఇది ఆమె కావాలని చేసిందా..? లేక పొరపాటున చేసిందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక, ఈ సినిమా విషయానికొస్తే.. మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ స్వరకర్త. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











