రవితేజతో పాయల్ రాజ్‌పుత్ రొమాన్స్.. క్రేజీ ఆఫర్ దక్కించుకున్న పంజాబీ భామ!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువత హృదయాల్లో సెగలు పుట్టించింది పాయల్ రాజ్ పుత్. ఈ పంజాబీ భామ అందాలు. బోల్డ్ పెర్ఫామెన్స్ కు యువత ఫిదా అయ్యారు. ఇప్పుడిపుడే పాయల్ మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం మాస్ మహా రాజా రవితేజ చిత్రంలో పాయల్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
రవితేజ ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. రవితేజ తదుపరి చిత్రం విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కబోతోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి విభిన్న చిత్రాలతో విఐ ఆనంద్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రవితేజ కోసం ఆసక్తికరమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ ఇప్పటికే హీరోయిన్ గా ఎంపికైంది. మరో హీరోయిన్ గా పాయల్ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ సంగీతం అందించనున్నాడు.


Click it and Unblock the Notifications











