మరో సీనియర్ హీరో సినిమాలో పాయల్ రాజ్‌పుత్!
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా వెంకీ మామ అనే మల్టీస్టారర్ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. జైలవకుశ ఫేమ్ బాబీ దర్శత్వం వహించబోతున్న ఈ చిత్రం ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకు వెంకీ సరసన సీనియర్ హీరోయిన్ శ్రీయ నటిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్ వెంకీ సరసన హీరోయిన్ గా నటించనుందట. కానీ హీరోయిన్ల విషయంలో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. పాయల్ రాజ్ పుత్ ఇప్పటికే నాగార్జున సరసన మన్మథుడు 2లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

కోనసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వెంకీ పల్లెటూరి వ్యక్తిగా నటిస్తాడట. నాగ చైతన్య సిటీ నుంచి వచ్చిన కుర్రాడిగా కనిపిస్తాడని సమాచారం. దర్శకుడు బాబీ మంచి వినోదాత్మక అంశాలతో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు, కోనవెంకట్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











