స్టార్ హీరోయిన్‌కు అలాంటి వేధింపులు.. ఇండస్ట్రీని వదిలిపొమ్మంటూ దారుణంగా..

సినీ పరిశ్రమ విచిత్రమైనది.. అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ ఇక్కడ నిలదొక్కుకోలేక కాలగర్భంలో కలిసిపోయిన నటీమణులు ఎందరో. ఎన్ని అవమానాలు, ఛీత్కారాలు ఎదురైనా ఎదురునిలిచి గెలిచి చూపించిన వారు మరికొందరు. అయితే ఇక్కడ రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా తోడు కావాలన్నది అనుభవజ్ఞుల మాట. ఇది ఎందరో విషయంలో నిజమైంది కూడా. హీరోల కంటే హీరోయిన్ల విషయంలోనే ఇది నిజమని అనిపిస్తుంది కూడా. అందంతో పాటు అభినయం ఉన్నప్పటికీ అదృష్టం లేక బండి లాగిస్తున్నవారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ఉన్నారు. తాజాగా ఇండస్ట్రీపై ఓ హీరోయిన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఇందూగా భయపెట్టిన పాయల్
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తీకేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పత్ అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించారు. అందులో ఆమె పోషించిన ఇందూ రోల్ కుర్రాళ్లకు వణుకు పుట్టించిందంటే అతిశయోక్తి కాదు. అందం, నటనపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బలంగా జెండా పాతేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

Payal Rajput s Emotional Post Goes Viral She Says I May Fail But I Won t Quit Acting

మంగళవారంతో తిరిగి రేసులోకి
ఆర్ఎక్స్ 100 విజయం తర్వాత అదే జోనర్‌లో సినిమాలు రావడం.. అన్ని ఇందూ తరహా పాత్రలు రావడంతో కన్‌ఫ్యూజ్ అయ్యారు పాయల్. అయినప్పటికీ సన్నిహితుల సలహా మేరకు సెలెక్ట్‌డ్‌గా మూవీస్ చేసుకుంటూ వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, రక్షణ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. మూసలో వెళ్లిపోతున్న పాయల్‌ కెరీర్‌కు తిరిగి మంగళవారం మూవీ ఊపిరి పోసింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రతో పాటు అందులో బోల్డ్ సీన్స్‌లోనూ పాయల్ రెచ్చిపోయి నటించింది.

లేడీ ఓరియెంటెడ్ మూవీతో బిజీ
ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్‌తో పాటు తెలుగులో కిరాతక మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. అలాగే పాయల్ లీడ్ రోల్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. అదే వెంకటలచ్చిమి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ముని దర్శకత్వం వహిస్తుండగా.. రాజా, ఎస్ఎస్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివాసీ మహిళ రివెంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై పాయల్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ తర్వాత తనను అంతా వెంకటలచ్చిమి అని పిలుస్తారని పాయల్ చెబుతోంది.

జీవితంలో ఓడిపోయానంటూ ఎమోషనల్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో‌షూట్‌లతో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు. ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో అందరినీ నవ్వించే పాయల్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నన్ను నటన మానేయమని కొందరు కోరుకుంటున్నారు. నేను మానేయాలా? వద్దా? అనే దానిపై నాకే సందేహం కలుగుతోంది. కానీ ఆ సమయంలో నేను 12 ఏళ్లుగా పడిన కష్టం గురించి ఆలోచిస్తాను. అందుకే వద్దు అని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. నేను కెరీర్‌లో ఫెయిల్ కావొచ్చు.. కానీ దానిని మాత్రం వదిలిపెట్టనని పాయల్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతుండగా.. పాయల్‌ను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమ్మని ఒత్తిడి చేస్తోంది ఎవరు? అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X