పాయల్ రాజ్‌పుత్ బూతులకు భారీ రెస్పాన్స్.. రికార్డు బద్దలు కొట్టేస్తుంది
'RX 100' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో చేసింది బోల్డ్ క్యారెక్టరే అయినప్పటికీ, తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీని తర్వాత ఎన్నో సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసింది. ఇలా.. సినిమాలు, స్పెషల్ సాంగులతో బిజీ బిజీగా గడుపుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.
అందంతో తెలుగు కుర్రాళ్లను తన వైపునకు తిప్పుకున్న పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం 'RDX లవ్' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎంతో గ్లామర్‌గా కనిపిస్తోంది. గతంలో విడుదలైన ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, రెండు రోజుల క్రితం ఈ సినిమా టీజర్ విడుదలైంది.
ఈ టీజర్‌లో కేవలం శృంగారాన్నే ఎక్కువగా ఫోకస్ చేయడం విశేషం. బెడ్ పై సీన్స్, పాయల్ రాజ్‌పుత్ క్లీవేజ్ యువతకు భలే కిక్కిచ్చింది. టీజర్ అంతా శృంగారం, సేఫ్టీలు, స్వర్గం గురించే చెప్పడం చూస్తుంటే 'RDX లవ్' సినిమాలో రొమాన్స్ డోస్ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుస్తోంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది.

అందంతో తెలుగు కుర్రాళ్లను తన వైపునకు తిప్పుకున్న పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తోన్న 'వెంకీ మామ' సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. అలాగే, రవితేజ హీరోగా నటిస్తోన్న 'డిస్కోరాజా' సినిమాలో కథానాయికగా చేస్తోంది.
'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించగా.. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. హుషారు ఫేం తేజస్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











