పడుకోవడం పై పాయల్ సందేశం.. ఈమెలో ఈ కోణం కూడా ఉందా?
పాల బుగ్గల పాప పాయల్ రాజ్‌పుత్ ఇచ్చిన సందేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి పాయల్‌లో ఈ కోణం కూడా ఉందా? అని ముక్కున వేలేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్. తన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఎకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటూ ఉంటుంది. ప్రతీ దినం ఫ్రెష్ అందాలతో కవ్విస్తూ కుర్రాళ్లను పరేషాన్ చేసే ఈ పంజాబీ బేబీ.. తాజాగా కొద్దిగా ట్రాక్ మార్చి పడుకోవడం పై సందేశం పెట్టి ఆకట్టుకుంది.
''తొందరగా పడుకోండి.. తొందరగా లేవండి.. అప్పుడే మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాడు'' అని పేర్కొంటూ ట్వీట్ పెట్టి.. తాను పడుకొని అందాలు ఆరబోస్తున్న పిక్ ఒకటి షేర్ చేసింది. ఈ ట్వీట్‌లో పాయల్ అందాలతో పాటు ఫిలాసఫీ కూడా ఫుల్లుగా ఉండటంతో నెటిజన్లు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. కామెంట్లు, లైకులతో హోరెత్తిస్తూ పాయల్ పిల్లలో ఈ కోణం కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక పాయల్ సినిమాలంటారా?.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఆరంగేట్రం చేసి అలా వచ్చి రాగానే అందాలతో కవ్విస్తూ కుర్రకారును బుట్టలో వేసుకుంది. దీంతో వరుస అవకాశాలు పట్టేసిన ఈ భామ ఇటీవలే సీత సినిమాలో ఐటెం సాంగ్ తో ఆకట్టుకుంది. బాలకృష్ణ రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా చోటు సంపాదించిన ఈ పాప.. ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న 'డిస్కో రాజా' మాస్ మహారాజ్ తో చిందులేస్తోంది. అలాగే వెంకీ మామ సినిమాలో వెంకటేష్ తో ఛాన్స్ పట్టేసింది. ఇదిగాక బాలకృష్ణ 105 లో కూడా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటిస్తోందని తెలిసింది. మొత్తానికైతే అటు వెండితెర, ఇటు నెట్టిల్లు రెండింటా పాయల్ హవా నడుస్తోందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











