ప్రియుడితో ఒకే బెడ్‌పై పాయల్ రాజ్‌పుత్ రచ్చ: అలా బయటకొచ్చిన వీడియో.. అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్
చాలా మంది అమ్మాయిలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీలోనే గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో మెప్పించిన ఈ భామ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో ప్రేమ వ్యవహారాన్ని కూడా పర్‌ఫెక్టుగా నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే పాయల్ రాజ్‌పుత్ తన ప్రియుడితో బెడ్ మీద ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎందుకు ఆలస్యం దానిపై లుక్కేయండి!
అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

అక్కడి నుంచి ఇక్కడకు... దూసుకెళ్తోంది
పంజాబీతో సహా పలు భాషల్లో హీరోయిన్‌గా నటించి కెరీర్‌ను ఆరంభించింది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే లవ్ ఫెయిల్యూర్ స్టోరీతో వచ్చిన 'RX 100' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పించి వరుస ఆఫర్లు అందుకుంది.

అప్పుడు కూడా అలా కనిపించి మెప్పించి
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో మైమరపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తెలుగులో చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే లాక్‌డౌన్ సమయంలో ఆహా కోసం 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌తో మెప్పించింది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బట్టలు లేకుండా దిగిన ఫొటోలన షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్.

ప్రియుడి వివరాలు బయట పెట్టేసిన భామ
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే అతడితో ఏదో ఒక ప్రదేశాన్ని చూట్టేలా టూర్లు ప్లాన్ చేసుకుంటోంది.

ఇప్పుడు అక్కడకు మకాం మార్చేసిందిగా
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ల పక్కన కూడా నటించేందుకు సిద్ధ పడుతోంది. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఇక, ఇప్పుడు మాత్రం ఓ పంజాబీ చిత్రంలో నటిస్తోంది. దీని కోసం ఆ రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోందీ అందాల ముద్దుగుమ్మ.

బాయ్‌ఫ్రెండ్‌తోనే కలిసి ఉంటోన్న పాయల్
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం పంజాబ్‌లో ఉన్న పాయల్ రాజ్‌పుత్.. ప్రియుడిని కూడా వెంటేసుకుని తిరుగుతోంది. ఆమె షూటింగ్‌కు వెళ్లినా.. బయటకు వెళ్లినా.. పార్టీలు చేసుకున్నా అతడిని తీసుకెళ్తోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియో వదులుతోంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రస్తుతం ఒకే హోటల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడు అక్కడా ఇక్కడా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రియుడితో ఒకే బెడ్‌పై పాయల్ రాజ్‌పుత్ రచ్చ
తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ప్రియుడు సౌరబ్ డింగ్రాతో కలిసి ఒకే బెడ్‌పై ఉంది. ఇందులో అతడు ఓ పాటను పాడుతున్నాడు. అది కూడా సెల్ఫీ వీడియో కావడంతో అతడి పక్కనే పాయల్ పడుకుని కనిపించింది. దీంతో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. తద్వారా మళ్లీ వార్తల్లో నిలిచిందీ బ్యూటీ.


Click it and Unblock the Notifications











