లవర్‌తో కలిసి హోటల్ రూంలో పాయల్ రచ్చ: ఏకంగా అతడిపై పడిపోయి మరీ.. మళ్లీ బుక్కైపోయిన బ్యూటీ
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. అందానికి అందం.. నటనక నటన ఉన్న ఈ అమ్మాయి.. వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అతడితో కలిసి బెడ్ మీద ఉన్న వీడియోను వదిలిన పాయల్.. తాజాగా లవర్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. ఇప్పుడిలా బిజీగా
పాయల్ రాజ్‌పుత్ పంజాబీ భాషలో హీరోయిన్‌గా నటించి కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే తర్వాత హిందీలోనూ చేసింది. అనంతరం బోల్డు కంటెంట్‌తో వచ్చిన 'RX 100' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పించి సత్తా చాటింది.

ఊహించని పాత్రలో.. అతడితోనూ జంటగా
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది పాయల్ రాజ్‌పుత్. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమె ఓ పంజాబీ చిత్రం నటిస్తోంది. అలాగే, తెలుగులో ఆహా సంస్థ కోసం ఓ వెబ్ సిరీస్‌ను చేస్తోంది. దీనిలో ఆమె ఊహించని పాత్రలో నటిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, తమిళంలోనూ ఉదయనిధితో ఓ సినిమా చేస్తుంది.

అందులో యమ యాక్టివ్... రచ్చ చేస్తుంది
సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటూ దూసుకెళ్తోంది పాయల్ రాజ్‌పుత్.

తన ఎఫైర్ గురించి లీక్ చేసి... ఫోటో కూడా
కెరీర్‌ను ఎంత సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోందో.. పర్సనల్ లైఫ్‌లోనూ యమ ఎంజాయ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఎక్కడికి వెళ్లినా అతడిని వెంట పెట్టుకుని వెళుతోంది. అందుకే ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది.

సినిమా కోసం అక్కడికి.. అన్నీ చెబుతోంది
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ల పక్కన కూడా నటించేందుకు సిద్ధ పడుతోంది. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఇక, ఇప్పుడు మాత్రం ఓ పంజాబీ చిత్రంలో నటిస్తోంది. దీని కోసం ఆ రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోందీ అందాల ముద్దుగుమ్మ.

ప్రియుడితో కలిసి ఒకే గదిలో పాయల్ బేబీ
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం పంజాబ్‌లో ఉన్న పాయల్ రాజ్‌పుత్.. ప్రియుడిని కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆమె షూటింగ్‌కు వెళ్లినా.. బయటకు తిరిగినా.. పార్టీలు చేసుకున్నా అతడు కనిపిస్తున్నాడు. ఇక, ఈ సినిమా షూటింగ్ కోసం వీళ్లిద్దరూ ప్రస్తుతం ఒకే హోటల్‌లో ఉన్నారట. ఈ విషయం కూడా బయటకు రావడంతో ఈ అమ్మడు అక్కడా ఇక్కడా హాట్ టాపిక్ అవుతోంది.
Recommended Video

లవర్‌తో కలిసి హోటల్ రూంలో పాయల్ రచ్చ
ఇటీవలే ప్రియుడు సౌరభ్‌తో కలిసి బెడ్ మీద ఓ వీడియో చేసిన పాయల్ రాజ్‌పుత్.. ఏకంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అతడితో హోటల్ రూంలోని అద్దం ముందర నిలబడి సెల్ఫీ దిగింది. ఇందులో అతడి మీద పడిపోయి మరీ ఫోజులిచ్చింది. దీన్ని సౌరభ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దాన్ని పాయల్ రాజ్‌పుత్ స్టోరీగా పెట్టుకుని షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











