ఆంటీలా చూపించాడు.. కెరీర్‌ను దెబ్బ తీశాడు.. డైరెక్టర్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్
RX100 మూవీలో ప్రతిభతోను, గ్లామర్‌తోనూ ఆకట్టుకొన్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు వరుస ఆఫర్లు పలకరించాయి. డైనమిక్ పాత్రలతోపాటు హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా వచ్చాయి. అయితే వెంకీమామ హిట్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ అవకాశాలు తగ్గడం, బడా డైరెక్టర్ల నుంచి అవకాశాలు కష్టమైపోయాయి. అయితే తన కెరీర్ నెమ్మదించడానికి కారణం ఓ డైరెక్టర్ అని తన సన్నిహితులతో పాయల్ చెప్పుకొన్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించడం చర్చానీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

హిట్లు లేకపోవడంతో నిరుత్సాహం
RX100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ పేరు సినిమా వర్గాల్లో మార్మోగిపోయింది. కేవలం అందాల ఆరబోతకే పరిమితం కాకుండా అభినయానికి మంచి పేరు రావడంతో ఆమె కోసం నిర్మాతలు క్యూ కట్టారు. క్రేజీ ప్రాజెక్టులు చేతికి చిక్కినా.. హిట్లుగా మారకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురిచేసింది. ఇక వెంకటేష్, నాగచైతన్య లాంటి కాంబినేషన్‌లో సినిమా ఆఫర్ రావడంతో పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

వెంకీమామతోనే దెబ్బ
అయితే వెంకీమామ సినిమాను అంగీకరించడం వల్ల తన కెరీర్‌కు నష్టం జరిగిందనే మాటను తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడిందంట. ఆ సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రను చేయకపోవడంతో నిర్మాతలు తనను మరో విధంగా ఊహించుకొంటున్నారని చెప్పుకొన్నట్టు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం వెల్లడించింది. ఇప్పుడు వెంకీ మామ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)పై పాయల్ గుర్రుగా ఉందనే విషయం కథనంలో వెల్లడైంది.

గ్లామరస్‌గా చూపించలేదని..
వెంకీమామలో వెంకటేష్ పక్కన గ్లామరస్‌గా నటిస్తే.. తనకు యువ హీరోల పక్కన నటించే అవకాశాలు వస్తాయని భావించారని, అయితే ఆ సినిమా ఆడకపోవడం, అలాగే అంటీలా తనను చూపించడంతో తన ఇమేజ్ దెబ్బ తిన్నదనే విషయాన్ని పాయల్ ప్రస్తావించినట్టు సమాచారం. వెంకీ మామలో రాశీఖన్నా కంటే ఓల్డ్‌గా చూపించడంపై దర్శకుడు బాబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

వయసుకు తగ్గినట్టుగా చూపించకపోవడంతో
వెంకటేష్‌తో ఎఫ్2 చిత్రంలో తమన్నా నటించిందని, ఆమెను చాలా గ్లామర్‌గా చూపించారని, అదే క్రమంలో తన పాత్ర ఉంటుందని అనుకొన్నాను. కానీ నా వయసుకు తగినట్టు కాకుండా ఆంటీలా తన పాత్రను మలిచారని వాపోయిందనే తాజా సమాచారం. అందుకే యంగ్ హీరోల పక్కన నటించే అవకాశాలు తగ్గిపోయాయా అనే ఫీలింగ్‌లో పాయల్ రాజ్‌పుత్ ఉన్నట్టు తాజా కథనంలో రాశారు.
Recommended Video

పాయల్ రాజ్‌పుత్ కెరీర్
వెంకీమామ తర్వాత మాస్ మహారాజా డిస్కో రాజాలో అతిథి పాత్ర లాంటి పాత్రలో కనిపించింది. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో పాయల్‌కు మంచి పేరు రాలేకపోయింది. ప్రస్తుతం తమిళ చిత్రం ఏంజెల్, తెలుగులో నరేంద్ర అనే చిత్రాల్లో నటిస్తున్నది. ఇంకా రెండు, మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











