రూమర్లపై మండిపడ్డ పాయల్ రాజ్‌పుత్.. దేవుడా ఇలాంటివి ఎక్కడి నుంచి..

RX 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ వరుస చిత్రాలతో ఆకట్టుకొన్నారు. ఆమె ఇటీవల నటించిన వెంకీ మామ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకొన్నది. తాజా కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే ఇటీవల తనపై వస్తున్న రూమర్లపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయవద్దని తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించింది.

ఇటీవల మీడియాలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలోనూ, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ రెండు చిత్రాల్లో ఐటెమ్ సాంగుల్లో నటించడానికి అంగీకరించారు అనే వార్తలు ఆమెను కొంత ఇబ్బందికి గురిచేశాయి. దాంతో ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు.

 Payal Rajput serious over fake news related Indian2, Pushpa

ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. నేను ఆ రెండు చిత్రాల్లో ఏ పాటలో కూడా నటించడం లేదు. నాతో ఎవరూ సంప్రదించలేదు. ఇండియన్ 2, పుష్ప చిత్రంలో నేను స్పెషల్ పాటల్లో నటిస్తున్నట్టు నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో భగవంతుడికే తెలియాలి. అలాంటి సినిమా పాటలను ఇంత వరకు ఒప్పుకోలేదు అంటూ ఇన్సాట్‌లో పేర్కొన్నారు.

ఇండియన్ 2, పుష్ప చిత్రాలు ఒప్పుకోలేదు. వాటి షూటింగులో పాల్గొన లేదు. కాబట్టి అలాంటి వార్తలన్నీ ఫేక్ న్యూసే. నా నుంచి వచ్చే వార్తలే నమ్మండి. మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోకండి అంటూ పాయల్ రాజ్‌పుత్ సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X