పాయల్ డేటింగ్ చేస్తోందా? ఇంతకీ అతనెవరు.. ఆయనతో అక్కడేం పని..?
Recommended Video
Rx 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నెటిజన్లకు షాకిచ్చింది. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఎకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటూ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రతీ దినం ఫ్రెష్ అందాలతో కవ్విస్తూ కుర్రాళ్లను పరేషాన్ చేసే ఈ పంజాబీ బేబీ.. తాజాగా ఓ ఫోటో షేర్ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి? వివరాల్లోకిపోతే..

హీరోయిన్స్ అన్నాక అలాంటివి కామన్
ఈ రోజుల్లో హీరోయిన్స్ అన్నాక లవ్ స్టోరీలు, డేటింగులు, బ్రేక్ అప్స్ కామన్. అయితే కొత్త హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ విషయంలో లవ్, డేటింగ్ లాంటి సంఘటనలు ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. కానీ తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ పిక్ అనుమానాలకు తావిస్తోంది. ఇది చూసి పాయల్‌లో ఈ కోణం కూడా ఉందా? అని ముక్కున వేలేసుకుంటున్నారు ప్రేక్షకులు.
అందమైన ప్రదేశం.. పాయల్ పక్కనే ఓ వ్యక్తి
ఇప్పటిదాకా తన గ్లామర్ లుక్స్ మాత్రమే షేర్ చేసిన పాయల్ రాజ్‌పుత్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పక్కన కూర్చున్న పిక్ షేర్ చేసింది. పైగా దానికి లవ్ సింబల్స్ యాడ్ చేసింది. ఓ ఎత్తైన అందమైన ప్రదేశంలో ఈ ఇద్దరూ కూర్చొని ఉన్నట్లుగా ఉంది ఈ పిక్. అయితే అతని ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది పాయల్.

ఇంతకీ అతనెవరు.. ఆయనతో అక్కడేం పని..?
పాయల్ షేర్ చేసిన ఈ ఫోటో చూసి నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. లవ్ సింబల్స్ పెట్టింది కాబట్టి ఆమె లవర్ అయి ఉంటాడు. అతనితో పాయల్ డేటింగ్ చేస్తుందేమో! అంటూ రియాక్ట్ అవుతున్నారు. సడెన్ గా పాయల్‌తో మరో వ్యక్తిని చూసి కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ఈ పిక్ చూస్తుంటే.. పాయల్ మరికొద్ది రోజుల్లోనే ఏదో ఒక వార్త చెప్పడం ఖాయం అని తెలుస్తోంది.

పాయల్ రాజ్‌పుత్ సినిమాలు
ఇటీవలే సీత సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకున్న పాయల్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెంకీ మామ' సినిమాలో నటిస్తోంది. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ నటిస్తోంది. దీంతో పాటు రవితేజ జోడీగా డిస్కో రాజా సినిమాలో, ఆర్‌డీఎక్స్ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది పాయల్.


Click it and Unblock the Notifications











