Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పాయల్ అంటే ఇంత పిచ్చా.. ఏకంగా క్రేన్‌తో తెచ్చి షాక్ ఇచ్చారు.. నోరెళ్లబెట్టిన RX100 బ్యూటీ
గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోలతో పెద్దగా నటించకపోయినప్పటికి ఆమెకు క్రేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంది. ఎక్కడికెళ్లినా కూడా కుర్రాళ్ళ సమూహాలు ఆమె కోసం ఎగబడతాయి. అంతగా క్రేజ్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ యాడ్స్ లలో అలాగే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లలో ఎక్కువగా దర్శనమిస్తోంది. ఇటీవల పాయల్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానుల ప్రేమను చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
ఎప్పుడైతే అలా కనిపించిందో
హీరోయిన్ అవ్వడానికి కంటే ముందు మంచి మోడల్ గా క్రేజ్ అందికున్న పాయల్ ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100లో హాట్ గా కనిపించిందో అప్పటి నుంచి ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికీ గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళ మనసులను దోచేసుకుంది.
ఆ సినిమాలు ప్లాప్
ఇక పాయల్ ఇప్పటివరకు ఆర్ఎక్స్ 100 తప్పితే మరో సినిమాతో హిట్ కొట్టింది లేదు.ఆ మధ్య వెంకీమామ, డిస్కోరాజ వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక మధ్యలో ఐటెమ్ సాంగ్స్ కూడా చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది.
షాక్ అయిన పాయల్
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా తరచూగా వెలుతోంది. రీసెంట్ గా గుడివాడకు వెళ్లిన పాయల్ అక్కడ కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఘన స్వాగతాన్ని అందుకుంది. ట్రెడిషినల్ గా పట్టు చీరలో అక్కడికి వచ్చిన పాయల్ అభిమానులను చూసి షాక్ అయ్యింది.
నోరేళ్ళబెట్టిన హాట్ బ్యూటీ
పాయల్ ను చూసేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. జనాలను కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బందికి చాలా కష్టమైంది. అయితే ఆమె రాగానే క్రేన్ తో తెచ్చిన అతిపెద్ద దండతో మర్యాద చేశారు. ఆ దండను చూసి పాయల్ ఆశ్చర్యపోయింది. నోరేళ్ళబెడుతూ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.