హీరోయిన్ ఎదురుగా ఫుల్ బాటిల్.. చేతిలో మందు గ్లాస్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
సినిమా ఇండస్ట్రీలో మద్యం అలవాటు ఉన్న నటీనటులు చాలా మంది ఉన్నారు. కొందరు ఓపెన్ గా బయటకు చెబితే మరికొందరు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. ఇక RGV లాంటి వాళ్ళైతే నా ఇష్టం అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మరి హడావుడి చేస్తారు. అయితే RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మాత్రం చాలా కూల్ గా సోషల్ మీడియాలో విస్కీ గ్లాసుతో దర్శనమిచ్చింది.

ఎదురుగా ఫుల్ బాటిల్, చేతిలో గ్లాస్
ఎదురుగా ఫుల్ బాటిల్, చేతిలో గ్లాస్ అందులో విస్కీ.. చాలా పద్దతిగా నవ్వుతూ కనిపించిన పాయల్ ఇంత సడన్ షాక్ ఎందుకు ఇచ్చిందని ఆమె ఫాలోవర్స్ ఆశ్చర్యపోయారు. ఫోటో పోస్ట్ చేసి ఈ బ్యూటీ మొదట క్లియర్ గానే వివరణ ఇచ్చింది. కానీ కొందరు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసి ఫొటో లీక్ అయ్యిందని ప్రచారాలు చేశారు. కానీ అందులో నిజం లేదు.

షాక్ ఇచ్చిన పాయల్
Rx 100 సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న పాయల్ ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా బోల్డ్ గానే ఉంటుంది. వీలైనంత వరకు హాట్ డోస్ లేనిదే ఫొటోలను పోస్ట్ చేయదు. కానీ ఎప్పుడు లేని విధంగా అమ్మడు విస్కీతో కనిపించే సరికి ఫాలోవర్స్ కాస్త షాక్ అయ్యారనే చెప్పాలి.

అసలు మ్యాటట్ ఇదన్నమాట..
అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఈ బ్యూటీ ఆ విస్కీ కంపెనీకి యాడ్ కోసమే అలా చేసినట్లు పోస్ట్ చూస్తే క్లియర్ గా అర్ధమవుతోంది. తెలంగాణలో ఈ అద్భుతమైన విస్కీ చాలా బావుంటుందని అంటూ ప్రమోషన్ స్టంట్ బాగానే వేసింది. చాలా మందికి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పటికీ కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందనే భయంతో వాటి జోలికి వెళ్ళరు. కానీ పాయల్ మాత్రం బోల్డ్ గానే ప్రచారం చేస్తోంది.

కెరీర్ పై పాయల్ సీరియస్
ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే.. మొదటి హిట్టు సినిమా ఆర్ఎక్స్ 100 సినిమా అనంతరం ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. రవితేజతో చేసిన డిస్కో రాజా, అలాగే వెంకీమామ సినిమాలు పక్కా హిట్టవుతాయని అంతా భావించారు గాని ఆ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఇక ఇప్పటి నుంచి కొంచెం ఆలోచించి సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటోంది. మరి ఈ హాట్ బ్యూటీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











