పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. బేబీ బంప్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్
సినీ పరిశ్రమలో ఎఫైర్లు, డేటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో నటీనటులు ప్రేమలో పడ్డారు, విడిపోయారు. కొన్నాళ్లు డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీతో షాకిచ్చిన సెలబ్రిటీలు ఉన్నారు. శ్రీదేవి, సారిక, రేణు దేశాయ్, అమీ జాక్సన్, నీనా గుప్తా, దియా మీర్జా, నటాషా వంటి స్టార్స్ తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేస్తూ గర్భం దాల్చారు. పిల్లల్ని కని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ తెలుగు స్టార్ హీరోయిన్ పెళ్లికాకుండానే బేబీ బంప్‌తో షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఆ నటి ఎవరో కాదు.. పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు పాయల్. అనంతరం ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, రక్షణ తదితర సినిమాలలో నటించారు. వరుస ఫ్లాప్‌లతో ఆమె కెరీర్ డీలా పడిన దశలో మంగళవారం మూవీతో కమ్ బ్యాచ్ ఇచ్చారు పాయల్ రాజ్‌పుత్.

ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్‌తో పాటు తెలుగులో కిరాతక మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. అలాగే పాయల్ లీడ్ రోల్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. అదే వెంకటలచ్చిమి. తెలుగుతో పాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలపై ఆమె ఫోకస్ పెట్టారు. పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లు కావొస్తున్నప్పటికీ సరైన బ్రేక్ ఆమెకు దక్కలేదు. పెద్ద హీరోల సినిమాలలో పాయల్‌కు అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తూనే ఉంది.
సౌరభ్ ధింగ్రాతో ప్రేమాయణ సాగిస్తున్న పాయల్ రాజ్‌పుత్.. ఆయనతో కలిసి పార్టీలు, వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే తన ప్రియుడిని తెలుగులో హీరోగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఆమె ఓ సినిమాలో నటింపజేస్తోంది. హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫస్ట్ టైం అనే మూవీలో సౌరభ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సినిమాలో అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తన సినిమాలు, వ్యక్తిగత వివరాలు, ఇతర సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది పాయల్. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. అందులో పొట్ట భాగం ముందుకొచ్చి.. నిండు గర్భంతో ఉన్నట్లుగా ఉంది. ఆ బేబీ బంప్‌తోనే పాయల్ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దాంతో నెటిజన్లు, అభిమానులు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. పెళ్లికాకుండానే పాయల్ తల్లికాబోతోందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే సదరు వీడియోకి నేను గర్భవతినే.. కానీ గర్భవతిని కాదు అంటూ క్యాప్షన్ పెట్టారు పాయల్. దాంతో ఇదేదో సినిమా షూటింగ్ కోసం వేసిన గెటప్ అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications


