రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్.. ‘అర్జున్ రెడ్డి’ మోడ్‌లోనే ఉన్నానంటూ..
యదార్థ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన 'RX 100' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో చేసింది బోల్డ్ క్యారెక్టరే అయినప్పటికీ, తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ఆమె చేసిన కన్నింగ్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి.
దీని తర్వాత ఎన్నో సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసింది. ఇలా.. సినిమాలు, స్పెషల్ సాంగులతో బిజీ బిజీగా గడుపుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ ఫొటో హాట్ టాపిక్ అవుతోంది.
పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు సిగరెట్లు ఒకేసారి కాలుస్తున్న ఫొటోను షేర్ చేసింది. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని పొగ ఊదుతూ ఇందులో కనిపించింది. అలాగే, ''ఇంకా కబీర్ సింగ్ / అర్జున్ రెడ్డి మోడ్‌లోనే ఉన్నా. ఇది షూటింగ్‌లో భాగంగా చేసింది. నా రాబోయే చిత్రంలో ఒక సన్నివేశం ఇది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం'' అని పాయల్ క్యాప్షన్ పెట్టింది.
ఈ పిక్ చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఇది సినిమాలో భాగమేనని ఆమె చెబుతున్నప్పటికీ, పాయల్ అభిమానులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ఇంత హాట్‌గా ఉండడంతో వారంతా అవాక్కవుతున్నారు. దీంతో ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిని చాలా మంది షేర్ చేస్తుండడంతో వైరల్ అయిపోయింది.
పాయల్ రాజ్‌పుత్ తాజాగా విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటస్తోన్న మల్టీ స్టారర్ 'వెంకీ మామ' సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. అలాగే, రవితేజ హీరోగా నటిస్తోన్న 'డిస్కోరాజా' సినిమాలో కథానాయికగా చేస్తోంది. అయితే, ఆమె షేర్ చేసిన పిక్ ఏ సినిమాలోనిది అనేది మాత్రం చెప్పలేదు.


Click it and Unblock the Notifications











