‘మహాసముద్రం’లో దిగుతున్న పాయల్: అందాలతో మాయ చేసేందుకే ఇలా!

'RX 100' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో ఆమె చేసింది బోల్డ్ క్యారెక్టరే అయినప్పటికీ, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీని తర్వాత ఎన్నో సినిమాల్లో అంతగా ఆకట్టుకోలేదు. అయితే, ఇటీవలి కాలంలో ఆమె వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో పాయల్ రాజ్‌పుత్ 'మహాసముద్రం'లో దిగేందుకు సిద్ధమైందని తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చింది.

'RX 100' వంటి హిట్ సినిమాను తెరకెక్కించినా.. రెండో ప్రాజెక్టు విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సుదీర్ఘ విరామం తర్వాత అతడు తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాసముద్రం'ను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా కథను ఎంతో మందికి చెప్పినప్పటికీ.. వర్కౌట్ కాలేదు. ఈ కారణంగానే ఇది ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో దీన్ని తెరకెక్కించబోతున్నాడు అజయ్ వర్మ. అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు.

Payal Rajput Special Song in Mahasamudram

ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో సిద్దార్ధ్ చేసేది నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెట్టనున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. గతంలో ఆమె తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ నటించిన 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X