ఆ 10 నిమిషాల్లో పాయల్ రాజ్‌పుత్‌‌కు ముచ్చెమటలు

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తీకేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల ఆరబోతతో పాటు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఇందూ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఈ పేరు చెబితే కుర్రాళ్లకు ఇప్పటికీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ బలంగా జెండా పాతేస్తారని అంతా అనుకున్నారు, కానీ పరిస్ధితులు ఇందుకు భిన్నంగా మారిపోయాయి.

మంగళవారంతో తిరిగి రేసులోకి
సహజంగానే చిత్ర పరిశ్రమలో ఒక కథ హిట్ అయితే.. అదే జోనర్‌లో కథలు రావడం.. అలాగే నటీనటులకు ఏ పాత్ర సెట్ అయితే.. అదే తరహాలో పాత్రలు రావడం కొనసాగుతుంది. పాయల్ పరిస్ధితి కూడా అలాగే తయారైంది. ఆర్ఎక్స్ 100 బ్లాక్‌బస్టర్ కావడంతో టాలీవుడ్‌లో అదే జోనర్‌లో సినిమాలు రావడం మొదలైంది. పాయల్‌కు కూడా ఇందూ తరహాలోనే పాత్రలు రావడంతో ఆమె కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయినప్పటికీ సన్నిహితుల సలహా మేరకు కథాబలం, తనకు ప్రాథాన్యమున్న పాత్రలే ఎంచుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, రక్షణ వంటి సినిమాలు చేశారు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న దశలో.. తిరిగి మంగళవారం మూవీతో గట్టిగా కమ్ బ్యాచ్ ఇచ్చారు పాయల్ రాజ్‌పుత్.

Payal Rajput Takes a Risk on Set Viral Ironing Incident Shocks Fans

లేడీ ఓరియెంటెడ్ మూవీతో బిజీ
ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్‌తో పాటు తెలుగులో కిరాతక మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. అలాగే పాయల్ లీడ్ రోల్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. అదే వెంకటలచ్చిమి. ఇక తనకు గైడ్‌లా, అన్ని విషయాల్లో అండగా నిలిచిన తండ్రి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు పాయల్. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ గతేడాది క్యాన్సర్‌తో కన్నుమూశారు. తన తండ్రిని కాపాడుకునేందుకు అన్నీ రకాలుగా ప్రయత్నించి ఓడిపోయానని పాయల్ రాజ్‌పుత్ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాలను వదిలిపెట్టను
అందరు హీరోయిన్ల మాదిరిగానే పాయల్ రాజ్‌పుత్ ట్రోలింగ్ బారినపడ్డారు. పలువురు హీరోలతో ఆమెకు రిలేషన్ కూడా అంటకట్టేశారు. అయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కెరీర్‌పై ఆమె పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. సినీ కెరీర్‌కు వీడ్కోలు పలకాలా? వద్దా? అనే దానిపై నాకే సందేహం కలుగుతోంది. కానీ ఆ సమయంలో నేను 12 ఏళ్లుగా పడిన కష్టం గురించి ఆలోచించి నన్ను నేను సముదాయించుకున్నా. కెరీర్‌లో ఫెయిల్ కావొచ్చు.. కానీ సినిమాలను మాత్రం వదిలిపెట్టనని పాయల్ తేల్చిచెప్పేశారు.

రిస్క్ చేసిన పాయల్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. సహజంగానే నటీనటులు షూటింగ్‌లో ఎంతో కష్టపడతారు. ఎన్నో ప్రమాదాల బారినపడి తీవ్రంగా గాయపడటం, ప్రాణాలనే పొగొట్టుకున్న వారూ ఉన్నారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్ రిస్క్ చేశారు. సాధారణంగా సినిమా షూటింగ్స్ విరామం లేకుండా సాగుతాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సెట్‌లోనే ఉండటంతో వారు ధరించే కాస్ట్యూమ్స్‌‌కి మరకలు పడటం, మడతలు రావడం జరుగుతాయి.

వణికిపోయిన పాయల్
ఇలాంటి పరిస్థితే ఓ షూటింగ్ సందర్భంగా పాయల్‌కు ఎదురైంది. అయితే షూటింగ్‌ గ్యాప్ చాలా తక్కువగా ఉండటం, మడతల్ని సరిచేయాల్సిన పరిస్థితి ఉండటంతో యూనిట్ సభ్యులు, పాయల్ అసిస్టెంట్స్ చాకచాక్యంగా వ్యవహరించారు. ఆమె బట్టల్ని విప్పకుండా.. శరీరంపైనే ఉంచేసి జాగ్రత్తగా ఇస్త్రీ చేసి ముడతలు సరిచేశారు. జరుగుతున్నది ఏం అర్ధం కాకపోవడంతో తొలుత టెన్షన్ పడ్డా.. ఆ తర్వాత పాయల్ నవ్వేశారు. అలాగే తన కోసం కష్టపడ్డ వారికి థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ డ్రెస్‌కి ఐరన్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుండగా .. ఏమాత్రం తేడా జరిగినా ఒళ్లంతా కాలిపోయేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: payal rajput movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X