షాకింగ్ న్యూస్: వేశ్యగా మారిన పాయల్ రాజ్‌పుత్.. అదీ ఒక హీరో కోసం!

హీరోయిన్లంతా శృతిమించి అందాలు ఆరబోసినా పెద్దగా ప్రయోజనం లేని ఈ రోజుల్లో పంజాబీ భామ పాల బుగ్గల పాయల్ రాజ్‌పుత్ మాత్రం వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో కార్తికేయతో ఆమె చేసిన రొమాన్స్ చూసి పాయల్ చుట్టే చేరిపోయారంతా. యంగ్, వెటరన్ హీరోలంతా ఈ అందాల పాపతోనే సినిమా చేస్తాం అంటున్నారట. అదీ పాయల్ ప్రస్తుత పరిస్థితి. ఇక ఇదిలా ఉండగా ఓ యంగ్ హీరో కోసం పాయల్ రాజ్‌పుత్ ఏకంగా వేశ్య అవతారం ఎత్తేసిందనే వార్త అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

వెండితెరపై వేశ్య పాత్రలో మెరవడం, వేశ్యగా హావభావాలు పండించడం కూడా నటనలో ఓ భాగమే. అందుకే ఇలాంటి పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం సందేహించరు కొందరు సుందరీమణులు. గతంలో వేదం చిత్రంలో అనుష్క లాంటి టాప్ హీరోయినే వేశ్య అవతారమెత్తగా.. తనకెందుకు మొహమాటం అనుకుందో ఏమో! పాయల్ కూడా వేశ్య క్యారెక్టర్ అనగానే సై అనేసిందట. ఈ విషయాన్ని పాయల్ రాజ్‌పుత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Payal Rajput turn as a prostitute

1970-80 మధ్యకాలంలో రాబిన్ హుడ్‌గా పేరు పొందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత‌క‌థ‌ ఆధారంగా టైగ‌ర్ అనే సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుండగా.. ఒకరు నిధిఅగర్వాల్, మరొకరు పాయల్ రాజ్‌పుత్ సెలెక్ట్ అయ్యారు. అయితే చిత్రంలో పాయ‌ల్‌ది వేశ్య పాత్ర‌ కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. కాగా దర్శకుడు కథ చెప్పగానే చాలెంజింగ్ రోల్ అనిపించింది.. అందుకే వేశ్యగా చేయటానికి ఒప్పుకున్నా అని పాయల్ చెప్పింది.

Payal Rajput turn as a prostitute

ఇవిగాక పాయల్ చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. సి.క‌ల్యాణ్ నిర్మాణంలో భానుశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటిస్తోంది పాయల్. అలాగే రవితేజ హీరోగా వస్తున్న డిస్కోరాజాలో బ‌ధిర యువ‌తిగా, వెంకీ మామ‌ సినిమాలో వెంక‌టేష్ జోడీగా ఆదిపడుతోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. తొలి సినిమా ఆర్ఎక్స్ 100లో కంటే రొమాంటిక్ ట్రీట్ ఎక్కువ ఇచ్చేందుకే పాయల్ సుముఖత వ్యక్తం చేస్తోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X