అలా ప్యాంట్ విప్పేసిన పాయల్ రాజ్‌పుత్: ఆ విధంగా రెచ్చిపోయిన RX100 హీరోయిన్
సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీరా అందులోకి వచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా జర్నీని కొనసాగించడం ఇంకా కష్టం. అలాంటి హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ కొందరు అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు. అందులో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్యాంట్ విప్పిన ఫోటోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

మొదటిదే బోల్డుగా.. అలా సాగుతోన్న కెరీర్
సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత పంజాబీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్. 'RX 100' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే బోల్డుగా నటించి షాకిచ్చింది. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

లాక్‌డౌన్‌లోనూ బిజీగానే.. అదరగొట్టేసిందిగా
ఎప్పుడైతే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఫుల్ బిజీగా గడుపుతోంది పాయల్ రాజ్‌పుత్. అంతెందుకు లాక్‌డౌన్ సమయంలోనూ షూటింగ్‌లు ఆగిపోయినప్పటికీ.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది పాయల్. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

బాయ్‌ఫ్రెండ్ వివరాలు రివీల్.. రచ్చ చేస్తోంది
వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా మంచిగానే ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రియుడి పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే అతడితో ఏదో ఒక టూర్ వెళుతూ తెగ హల్‌చల్ చేస్తోంది.

వాటికి కూడా రెడీ.. అందులో చేస్తుందంటూ
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. స్పెషల్ సాంగ్స్‌కు సైతం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్.. 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం'లోనూ ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్.

అక్కడ ఫుల్ బిజీగా.. అలాంటి వాటితో రచ్చ
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఊహించని ఫొటోను వదలింది పాయల్ రాజ్‌పుత్.
Recommended Video

అమాంతం ప్యాంట్ విప్పేసిన హాట్ హీరోయిన్
పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అమాంతం ప్యాంట్ బటన్‌తో పాటు జిప్ కూడా తీసేసింది. దీంతో ఆమె నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక, ఇందులో ఆమె కిందకు చూస్తూ నిశ్శబ్దంకు ఉన్న వ్యాల్యూను చెబుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. తద్వారా ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











