పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ డెసీషన్: వివాదాస్పదమైనా రెచ్చిపోయి.. దానికి మించి చూపించబోతుందట

మొదటి సినిమానే బోల్డ్ కంటెంట్ ఉన్న దానిని ఎంచుకున్నా.. అద్భుతమైన యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. అందానికి అందం.. నటనకు నటన ఉన్నప్పటికీ.. సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ బ్యూటీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. కానీ, వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా రెండు మూడు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ సెన్సేషనల్ డెసీషన్ తీసుకుందని తెలుస్తోంది. అసలేంటా నిర్ణయం? పూర్తి వివరాలు మీకోసం!

హాట్ హాట్ ఫోజులతో లావణ్య త్రిపాఠి అందాల విందు

బోల్డు పాత్రలో మెప్పించి.. వరుస ఆఫర్లతో

బోల్డు పాత్రలో మెప్పించి.. వరుస ఆఫర్లతో

పంజాబీలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది పాయల్ రాజ్‌పుత్. అక్కడ పలు చిత్రాల్లో నటించిన తర్వాత తమిళంతో పాటు హిందీలోనూ నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే అజయ్ భూపతి రూపొందించిన 'RX 100' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో ఆమె చేసిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. తద్వారా వరుసగా ఆఫర్లు దక్కాయి.

 సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండానే

సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండానే

మొదటి సినిమాలోనే సత్తా చాటిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ పాత్రలే కాకుండా యాక్టింగ్ స్కోప్‌ ఉన్న వాటిలోనూ నటిస్తోంది.

నటనతో సక్సెస్... కమర్షియల్‌గా ఫెయిల్

నటనతో సక్సెస్... కమర్షియల్‌గా ఫెయిల్

పాయల్ రాజ్‌పుత్ కెరీర్ జయాపజయాలతో సాగుతున్నప్పటికీ.. దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోరుతున్నారు. తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఆమె సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అంతెందుకు లాక్‌డౌన్ సమయంలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌‌తో మెప్పించింది.

అక్కడా.. ఇక్కడా.. ఫుల్ బిజీగా పాయల్

అక్కడా.. ఇక్కడా.. ఫుల్ బిజీగా పాయల్

పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతానికి తెలుగులో కొన్ని సినిమాలు చేస్తోంది. అదే సమయంలో పంజాబీలోనూ ఓ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం అమ్మడు అక్కడికి వెళ్లింది. కొద్ది రోజుల పాటు ఆ షెడ్యూల్‌లో పాల్గొనబోతుంది. అలాగే, తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో 'ఏంజెల్' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ డెసీషన్

పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ డెసీషన్

పాయల్ రాజ్‌పుత్ వరుసగా సినిమాలు చేయడమే కాదు.. మధ్య మధ్యలో వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా ఆహా ఓటీటీ సంస్థతో ఆమె పలు సిరీస్‌లకు ఒప్పందం కూడా చేసుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పాయల్ 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీనికోసం ఈ అమ్మడు ఓ సెన్సేషనల్ డెసీషన్ తీసుకుందని తెలిసింది.

Recommended Video

#RIPKVAnand: Allu Arjun ఎమోషనల్‌.. ప్రముఖుల సంతాపం KV Anand చిత్రాలు పెద్ద హిట్ || Filmibeat Telugu
మరోసారి రెచ్చిపోయి.. దానికి మించేలా

మరోసారి రెచ్చిపోయి.. దానికి మించేలా

'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో పాయల్ రాజ్‌పుత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. అంతేకాదు, ఈ రోల్ కోసం ఆమె ఎంతో గ్లామర్‌గా కనిపించబోతుందని తెలుస్తోంది. పక్కదారి పట్టిన నేటి యువతను ప్రతిబింబించేలా ఆమె క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని అంటున్నారు. మొత్తంగా ఈ సిరీస్‌లో ఆమె పాత్ర వివాదాస్పదంగా ఉంటుందట. కానీ, యాక్టింగ్‌కు స్కోప్ దక్కుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X