కరోనా టెస్ట్ చేస్తుంటే చిన్నపిల్లలా ఏడ్చిన హీరోయిన్ ..
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా వెంకీమామ చిత్రంలో నటించినా మరో సక్సెస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ కరోనా టెస్ట్ చేయించుకుంది.
టాలీవుడ్ లో సినిమా సందడి మళ్ళీ మొదలైన విషయం తెలిసిందే. తగు జాగ్రత్తలు తీసుకొని హీరో హీరోయిన్లు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ కూడా షూటింగ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ అమ్మడు ఇందులో భాగంగా కరోనా టెస్ట్ చేయించుకుంది. కరోనా పరీక్ష కోసం పాయల్ దగ్గర నుంచి శాంపిల్స్ ను తీసుకున్నారు వైద్య సిబ్బంది ఆ సమయంలో చిన్న పిల్లలా ఏడ్చేసింది పాయల్.

ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు చిన్న పిల్లల్లా గోలచేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో పై పాయల్ స్పందిస్తూ .. శాంపిల్స్ తీసుకోవడంతో చాలా భయమేసింది...భయంగా, ఇబ్బందిగా అనిపించింది. ఏదేమైనా టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది పాయల్ .


Click it and Unblock the Notifications











