Just In
- 20 min ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
- 54 min ago
అడ్డంగా బుక్కైన అఖిల్ సార్థక్: మోనాల్‌తో వాట్సప్ చాట్ లీక్.. బండారం బయటపెట్టిన యాంకర్!
- 1 hr ago
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- 11 hrs ago
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
Don't Miss!
- Lifestyle
ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
- Sports
మెరిసిన సిరాజ్.. లంచ్ విరామానికి ఆసీస్ 149/4!! ఆధిక్యం 182!
- News
హిందూ దేవుళ్లను కించపరిచేలా: మనోభావాలు దెబ్బతిన్నాయ్: ఆ వెబ్ సిరీస్‌పై ఎఫ్ఐఆర్
- Finance
ఇండియన్ ఐటీ రంగానికి గుడ్ ఇయర్, కానీ సవాళ్లున్నాయి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సింప్లిసిటీలోనే ఎంతో అందముందట.. కెమెరామెన్‌కు దండం పెట్టిన కీర్తీ సురేష్
కీర్తి సురేష్ ఎంత సింపుల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కీర్తి సురేష్‌ది సహజ సౌందర్యమే. ఈ విషయాన్ని ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ కూడా చెప్పేశాడు. తాజాగా కీర్తి అందాన్ని వర్ణించాడు. అదిరిపోయే ఫోటోను షేర్ చేస్తూ కీర్తి సురేష్ అందానికి కితాబిచ్చాడు. రంగ్ దే సినిమా కోసం ఈ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్‌లో కీర్తి సురేష్‌ను పీసీ శ్రీరామ్ ఎంత అందంగా చూపించాడో మనమంతా చూశాం.
కీర్తి సురేష్ దీపావళి వేడుకల్లోనూ ఎంతో సింపుల్‌గా ఉంది. మామూలు పంజాబీ డ్రెస్ ధరించి, సాధారణ పక్కింటి అమ్మాయిలానే కనిపించింది. క్రాకర్స్ కాల్చి అలిసిపోయిన కీర్తి సురేష్ ఇంట్లో గార్డెన్‌లోనే సేద తీరింది. తన చెప్పులు పక్కనే పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తాజాగా కీర్తీ సురేష్ ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఓ ఫోటోను షేర్ చేశాడు సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్. దానికి పెట్టిన క్యాప్షన్ కీర్తి సురేష్ ఇచ్చిన రిప్లై తెగ వైరల్ అవుతోంది.

సింప్లిసిటీలో ఎంతో అందం ఉంటుంది అని కీర్తి సురేష్ ఫోటోను పీసీ శ్రీరామ్ షేర్ చేశాడు. అంత గొప్ప కెమెరామెన్ అలాంటి ప్రశంసలు ఇవ్వడంతో కీర్తి గాల్లో తేలిపోయింది. ఆనందంలో మాటలు రాకపోవడంతో దండం పెట్టేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోటోలు, పీసీ శ్రీరామ్ తీసిన యాంగిల్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఎంతైనా పీసీ శ్రీరామ్ కెమెరా పెడితే ఎవ్వరైనా అందంగా కనిపిస్తారని కొందరు అంటుంటే.. కీర్తి సురేష్ ఎప్పుడైనా సింపుల్‌గానే ఉంటుంది.. అందంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.