పెద్ది మూవీపై కొత్త వివాదం.. నెగెటివ్ రివ్యూకి జాన్వీ లైక్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ ఏడాదిలో అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా పెద్ది నిలిచింది. ఇలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న పెద్ది మరో కారణంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రపై వస్తున్న విమర్శలు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా పరిణామాలు కొత్త వివాదానికి దారితీశాయి. ఇంతకీ ఏమైందంటే?

Also Read
Peddi USA Collections: నార్త్ అమెరికాలో పెద్ది ప్రభంజనం.. రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Peddi USA Collections: నార్త్ అమెరికాలో పెద్ది ప్రభంజనం.. రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

భారీ అంచనాల మధ్య పెద్ది సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. చాలా మంది పాజిటివ్ ఇవ్వగా, కొంతమంది మాత్రం నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా అచియమ్మ పాత్రపై నెగిటివ్ రివ్యూ వచ్చాయి. ఇందులో కథ మొత్తం పెద్ది పాత్ర చుట్టూ తిరుగుతుంది. కానీ, హీరోయిన్ పాత్రకు తగినంత ప్రాధాన్యం దక్కలేదని కొందరు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో హీరో ఎదుగుదల, అతని భావోద్వేగ ప్రయాణం, గ్రామ గౌరవం కోసం చేసే పోరాటం ప్రధానంగా నిలిచినప్పటికీ, అచియమ్మ పాత్రకు ప్రాధాన్యత లేదని, మరోసారి జాన్వీకి అన్యాయం జరిగిందని విమర్శలు వస్తున్నాయి.

Recommended For You
Peddi: రామ్ చరణ్ నయా రికార్డు.. సలార్, పుష్ప 2 సరసన పెద్ది!
Peddi: రామ్ చరణ్ నయా రికార్డు.. సలార్, పుష్ప 2 సరసన పెద్ది!
Peddi Controversy Janhvi Kapoor s Instagram Like Sparks Debate Over Achiyamma Role

ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ సినీ విశ్లేషణ పేజీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో సినిమాలో హీరో పాత్రను బలంగా తీర్చిదిద్దగా, హీరోయిన్ పాత్రను మాత్రం పరిమిత స్థాయిలో చూపించారని విమర్శించారు. ముఖ్యంగా ఈ పోస్ట్ లో అచియమ్మ పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. సినిమా పెద్ద స్థాయిలో తెరకెక్కినా, హీరోయిన్ పాత్ర ప్రాముఖ్యత లేదనీ, మరోసారి జాన్వీకి అన్యాయం జరిగింది అనే కోణంలో పోస్ట్‌ పెట్టారు. అయితే.. ఈ పోస్టుకు జాన్వీ కపూర్ లైక్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె నేరుగా ఎలాంటి కామెంట్ చేయకపోయినా, ఆ పోస్టును లైక్ చేయడం ద్వారా ఆ విమర్శలతో ఏకీభవించినట్లుగా కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.

You May Also Like
నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా.. సీరియల్ హీరోయిన్ ఆవేదన
నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా.. సీరియల్ హీరోయిన్ ఆవేదన

ఆ పోస్ట్‌కు జాన్వీ కపూర్ లైక్ చేసినట్లు సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో అసలు చర్చ మొదలైంది. హీరోయిన్ స్వయంగా ఆ పోస్ట్‌ను లైక్ చేయడం వెనుక అర్థమేంటన్న ప్రశ్నలు నెటిజన్లలో మొదలయ్యాయి. కొందరు జాన్వీ కూడా తన పాత్రపై అసంతృప్తిగా ఉందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఒక పోస్ట్‌ను లైక్ చేసినంత మాత్రాన ఆమె ఆ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించిందని చెప్పలేమని వాదిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, కొంతసేపటి తర్వాత ఆ లైక్ కనిపించకుండా పోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

 Peddi: పెద్దిపై సమంత రివ్యూ.. రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్..
Peddi: పెద్దిపై సమంత రివ్యూ.. రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్..

మరోవైపు, ఆ వైరల్ పోస్ట్‌లో చేసిన కొన్ని ఆరోపణలు కూడా చర్చకు దారి తీశాయి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో కొన్ని సన్నివేశాలపై జాన్వీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, కొన్ని షాట్లను తొలగించాలని సూచించిందని పేర్కొన్నారు. అయితే అవి ఫైనల్ కట్‌లో కొనసాగాయని ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు జాన్వీ కపూర్ గానీ, దర్శకుడు బుచ్చిబాబు గానీ, నిర్మాతలు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ప్రచారాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.

Read more about: janhvi kapoor peddi ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X