ఇది నా అదృష్టం.. జాను పాప తెలుగు స్పీచ్ కు పడిపోవాల్సిందే
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమా ప్రమోషన్స్ వేగం అందుకుంది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ "ది వండర్‌మెంట్ హైదరాబాదు" పేరుతో నిర్వహించిన లైవ్ మ్యూజిక్ కచేరీలో పెద్ది టీం హాజరైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారు. దీంతో వేదిక మొత్తం హోరెత్తిపోయింది. ఈవెంట్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్, అతని బృందం "పెద్ది" సినిమా తొలి సింగిల్ "చికిరి చికిరి" పాటను లైవ్‌లో ప్రదర్శించగా, ఆ వేదిక సంగీత మంత్రంతో మునిగిపోయింది. అనంతరం హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడుతూ, "పెద్ది సినిమాలో నటించే అవకాశం అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా ఫస్ట్ సింగిల్. మీకు నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సినిమాలో మీకు నేను చాలా కష్టపడుతున్నా.. అలాగే..ఈ సినిమా చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా తెరకెక్కించడానికి చాలా కష్టపడుతున్నాను. అలాగే మీకు మంచి సినిమా ఇవ్వాలని మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, దర్శకుడు బుచ్చి బాబు టేకింగ్ చాలా బాగుంది' అంటూ తెలుగులో మాట్లాడింది.

ఈ ముద్దుగుమ్మ తెలుగు స్పీచ్ ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది. ఆమె స్వీట్ తెలుగు యాక్సెంట్, సహజమైన స్పీచ్ అభిమానులను కట్టిపడేసింది. సోషల్ మీడియాలో "జాన్వీ తెలుగు స్పీచ్ సూపర్", "జాను పాప తెలుగు మాట్లాడింది... మనసు దోచుకుంది" అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ, "ఏఆర్ రెహమాన్ సర్‌తో కలిసి పనిచేయడం నా చిన్ననాటి కల. అది ఇప్పుడు 'పెద్ది' చిత్రంతో నిజమవుతోంది. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. నా హృదయానికి దగ్గరైన సబ్జెక్ట్ ఇది. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మాకు కొత్త శక్తినిస్తుంది" అని అన్నారు. ఆయన మాటలు వినగానే అభిమానులు కేరింతలు ఆకాశాన్ని అంటాయి.
'పెద్ది' సినిమా ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. మానవీయ సంబంధాలు, భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ కథను దర్శకుడు బుచ్చిబాబు సానా గ్రాండ్ విజువల్ స్టైల్‌లో చూపించనున్నాడు. నవంబర్ 7న విడుదలైన "చికిరి చికిరి" పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విడుదలైన 24 గంటల్లోనే అన్ని వెర్షన్లలో కలిపి 46 మిలియన్ల వ్యూస్ సాధించింది. గాయకుడు మోహిత్ చౌహాన్ వాయిస్, ఏఆర్ రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ హుక్ స్టెప్ ఈ పాటకు పెద్ద హిట్ ట్యాగ్ తెచ్చాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బుచ్చిబాబు సానా వహిస్తుండగా, సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.
"పెద్ది" చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. మొత్తానికి ఏఆర్ రెహమాన్ లైవ్ కచేరీలో రామ్ చరణ్ - జాన్వీ కపూర్ ఎంట్రీ, జాన్వీ తెలుగు స్పీచ్, రామ్ చరణ్ ఎమోషనల్ వర్డ్స్ కలిసి ఆ ఈవెంట్‌ను మరపురానిదిగా మార్చేశాయి. ఇలా'పెద్ది'పై హైప్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











