బికినీలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల.. విహరయాత్రలో బోల్డ్ అవతారంతో!

సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులో బాడీ షో చేయరు అనే టాక్ ఉండేది. అయితే, ఇదంతా గతం మాత్రమే. ఇప్పుడు మన బ్యూటీలు అందాలను ఆరబోయడంలో వెనక్కి తగ్గడం లేదు. అలా కొంత కాలంగా రెచ్చిపోతోన్న వారిలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లు చేసుకుంటూ కెరీర్ మొదలెట్టిన ఈ అమ్మాయి.. యాంకర్ ప్రదీప్‌తో 'పెళ్లి చూపులు'తో సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇక, తాజాగా జ్ఞానేశ్వరి కొన్ని బికినీ ఫొటోలను వదిలింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

అలా మొదలైన ప్రయాణం
వైజాగ్‌కు చెందిన జ్ఞానేశ్వరి కాండ్రేగుల టీనేజ్‌లో ఉన్నప్పుడే మోడల్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది. అలా చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. వాటి ద్వారా నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. దీంతో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. ఇలా జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఆరంభంలోనే ఎన్నో చిత్రాలతో అలరించింది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Stunning Photos Viral

ప్రదీప్‌తో పెళ్లిచూపులతో

ఆ మధ్య తెలుగు బుల్లితెరపై 'పెళ్లిచూపులు' అనే షో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఇందులో పద్నాలుగు మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్‌ లీడ్‌గా ఈ షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో విజేతగా నిలిచిన అమ్మాయితో ప్రదీప్‌కు పెళ్లి చూపులు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. ఇందులో అతడి హృదయాన్ని గెలుచుకుని జ్ఞానేశ్వరి టైటిల్‌ను అందుకుంది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Stunning Photos Viral

హీరోయిన్‌గా ఫుల్ బిజీగా
'పెళ్లి చూపులు' షో తర్వాత జ్ఞానేశ్వరి ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఆమె హీరోయిన్‌గా 'మిస్టర్ అండ్ మిస్' మూవీలో నటించింది. ఆ తర్వాత కూడా 'నీ జతగా', 'మాయలో', 'చక్రవ్యూహం' వంటి చిత్రాల్లో చేసింది. ఇప్పుడు కూడా జ్ఞానేశ్వరి కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో లీడ్ రోల్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Stunning Photos Viral

అందులో ఫుల్ యాక్టివ్‌నే

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ జ్ఞానేశ్వరి మాత్రం సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటూ వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో జ్ఞానేశ్వరి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన అందమైన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Stunning Photos Viral

ఎక్కువగా అలాంటివేగా
సోషల్ మీడియా పుణ్యమా అని జ్ఞానేశ్వరి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె ఓవర్‌గా బాడీ షో చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలన్నీ చూపించేలా దిగిన ఫొటోలను, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకోవడంతో పాటు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Pelli Choopulu Fame Gnaneshwari Kandregula Latest Stunning Photos Viral

జ్ఞానేశ్వరి ఫొటోలు వైరల్

సోషల్ మీడియాలో కొంత కాలంగా జ్ఞానేశ్వరి డోస్ పెంచేసి మరీ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో టూ పీస్ బికినీ ధరించి విపరీతంగా బోల్డు షో చేస్తోంది. ఫలితంగా జ్ఞానేశ్వరి షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ ఫుల్ వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X