టాప్ ప్లేస్ పై కన్నేసిన తెలుగుగుమ్మ... జోరు పెంచిన రీతూ వర్మ
పెళ్లిచూపులు గ్రాండ్ సక్సెస్ తరువాత విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ రేంజ్ కు చకచకా చేరుకున్నాడు. అతని కో-స్టార్ రీతూవర్మ .. తెలుగునాట మరికొన్ని ఆఫర్లు అందుకున్నప్పటికీ, అవేమీ అమ్మడికి కలసిరాలేదు. ఇక కోలీవుడ్, మల్లూవుడ్ ను కూడా ఓసారి చుట్టేసి వచ్చేసిన ఈ చిన్నదానికి ఇప్పుడు ఆఫర్లు వెల్లవెత్తుతున్నాయట.
ఆ మధ్య మల్లూవుడ్ సూపర్ స్టార్ దుల్కల్ సల్మాన్ తో కలసి నటించిన కనులు కనులు దోచాయంటే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ, అమ్మడి పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడటంతో ఇప్పుడు అవకాశాల తాకిడి పెరిగింది. ఇప్పటికే అమ్మడు ధృవ నక్షత్రంలో చియన్ విక్రమ్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతుండగా, మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు అమ్మడి కిల్ లో చేరినట్లు తెలుస్తోంది.

తమిళనాటే కలైయరాసన్ తో చైనా అనే సినిమాలో నటిస్తున్న రీతూ, తెలుగులో నానీతో టక్ జగదీశ్, శర్వానంద్ కు జోడీగా ఓ బైలింగువల్ మూవీ కూడా చేసేందుకు అంగీకరించింది. తాజాగా నిఖల్ సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్ లోనూ అమ్మడే లీడ్ హీరోయిన్ గా ఎంపికైందట.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2కి, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. మరి, ఈ సెకండ్ ఛాన్స్ ను రీతూ ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











