twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్యకాంతం: నిహారికతో పాటు నటించిన మరో బ్యూటీ ఎవరంటే..

    |

    రాహుల్ విజ‌య్‌, నీహారిక కొణిదెల న‌టిస్తున్న సూర్యకాంతం. నిన్న ట్రైలర్ విడుదలైన తర్వాత ఒక హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తేలిపోయింది. అయితే అందులో అందంగా మెరిసిన ఇంకో బ్యూటీ ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. ఆ నటి పేరు పెర్లిన్. పూర్తి పేరు పెర్లిన్ భెసానియా.

    ముంబైలో పుట్టి పెరిగిన పెర్లిన్ 30కి పైగా యాడ్స్ ఫిల్మ్స్‌లో నటించింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 'సూర్యకాంతం'. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ సినిమాలో పూజా అనే పాత్ర చేశా. చాలా మెచ్యూర్‌గా, సెన్సిబుల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటుంది. ఎవ‌రైనా న‌చ్చితే నేరుగా త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పే పాత్ర. ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ మాత్ర‌మే కాదు. అంత‌కు మించి ఇందులో చాలా ఉంటుందని తెలిపారు.

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక!ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మిడిల్ ఫింగర్ చూపించిన నిహారిక!

    Perlene Bhesania tollywood debut with Suryakantham movie

    నిహారిక‌తో కొన్ని సీన్లున్నాయి. త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. నిహారిక చాలా జెన్యూన్ ప‌ర్స‌న్‌. నాకు తెలుగు రాకపోయినా డిక్ష‌న్‌ను హిందీలో రాసుకునిఈజీగా చెప్పాను. ఈ సినిమాలో కొన్ని పాత్ర‌ల‌ను దర్శకుడు ప్ర‌ణీత్ నిజ జీవితం నుంచి చాలా ఇన్‌స్ప‌యిర్ అయి రాసిన‌ట్టు అనిపించిందిని తెలిపారు.

    'సూర్య‌కాంతం చిత్రం చేస్తుండగానే ఆఫ‌ర్లు రావడం మొదలయ్యాయి. నా ప‌నితీరు న‌చ్చి చాలా మంది అప్రోచ్ అయ్యారు. వచ్చిన అన్ని ప్రాజెక్టులు చేయడానికి సైన్ చేయడానికి తొంద‌ర‌ప‌డ‌టం లేదు. నాకు అర్జున్‌రెడ్డి హిందీ వెర్ష‌న్‌కు అవ‌కాశం వ‌చ్చింది కానీ వర్కౌట్ కాలేదని పెర్లిన్ తెలిపారు.

    English summary
    Mumbai actress Perlene Bhesania tollywood debut with Suryakantham movie. Suryakantam Trailer ft. Niharika, Rahul Vijay. Written and Directed by Pranith Bramandapally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X