హీరోయిన్ చర్య దారుణంగా ఉంది: దాన్ని కాదు...ఆవిడను వేలాడదీయండి!
హేష్ బాబు మూవీ '1-నేనొక్కడినే' సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన కృతి సానన్ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోలేదు. బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ మేగజైన్ ఫోటో షూట్ కారణంగా విమర్శలపాలైంది.
ఇంగ్లాండ్‌లోని ఎనీహో పార్కులో జరిగిన ఫోటో షూట్లో కృతి సానన్ పాల్గొంది. ఒక ఫోటోలో ఆమె వెనక జీవం లేని జిరారఫీ వేలాడదిసీ ఉండటం పలువురికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమెతో పాటు ఫోటోగ్రాఫర్, మేగజైన ఎడిటర్‌ను విమర్శిస్తూ ట్రోల్స్ చేశారు.
'జంతువుల్ని ఇంకా చక్కగా చూపించే మార్గాలు కూడా ఉన్నాయి. జీవంతో ఉన్నా, లేకపోయినా జంతువులు ఆడుకునే బొమ్మలు కాదు. జిరాఫీకి కృతి సానన్‌ను వేలాడదీయాల్సింది. జంతువుల్ని ఫ్యాషన్ ఫొటోగ్రఫీ కోసం ఉపయోగించడం సృజనాత్మకతా? అంటూ పలువురు మండి పడ్డారు.

ఎనీహో పార్కులో చనిపోయిన జంతువుల కళేబరాల్ని టాక్సిడెర్మిడ్ పద్ధతి ద్వారా నిల్వ ఉంచుతారు. అలా చేయడం ద్వారా అవి అచ్చ జీవంతో ఉన్న బొమ్మల్లా కనిపిస్తాయి. దీనిపై మేగజైన్‌తో పాటు కృతి స్పందించారు. తమకు జంతువులంటే ఎంతో ప్రేమ ఉందని, ఫోటో షూట్ కోసం ఏ జంతువును హింసించలేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











