Pooja hegde: సూర్యుడి ముందు అందాలను ఆరబోసిన బుట్టబొమ్మ.. వేడికే వేడి పుట్టించేలా..
టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే రేంజ్ రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతోంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక అప్పుడప్పుడు ఫొటో షూట్స్ తో వేడి పుట్టించే బుట్టబొమ్మ రీసెంట్ గా అంతకుమించి అనేలా మరోసారి హాట్ స్టిల్ ఇచ్చింది.

ఏకంగా బికినీలో కనిపించి
పూజా హెగ్డే ఈ స్తాయిలోకి రావడానికి చాలానే కష్టపడింది. మొదట్లో మంచి అవకాశాలు వచ్చినా కూడా చేసిన సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. యాడ్స్ తో అందుకున్న క్రేజ్ ను బిగ్ స్క్రీన్ వరకు కొనసాగించడానికి ఆమె ఎన్నో అపజయాలను దాటాల్సి వచ్చింది. ఇక డీజే సినిమా పూజా తలరాతను మార్చేసింది. ఏకంగా బికినీలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

ట్రోలింగ్స్ ఎన్ని వచ్చినా
ఆ సినిమా అనంతరం మెల్లగా పెద్ద హీరోలను ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ దానికి తోడు ఫొటో ఘాట్స్ తో మరింత మంటలను రేపింది. సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆమె ఫొటోలు ఏకధాటిగా ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోతాయి. ఇక ట్రోలింగ్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ ఏనాడు వాటిని పట్టించుకున్నది లేదు.

విజయ్ 65వ సినిమా కోసం
ఇక రీసెంట్ గా విజయ్ 65వ సినిమా కోసం నిర్వహించిన ఫొటో షూట్ లో అమ్మడు కేవలం తన హావభావాలతోనే హీటెక్కించింది. చిన్నగా క్లివేజ్ షోతో సూర్యుడు ముందు అందాలను అరబోసింది. ఇక ఆమె ఫేస్ లో హాట్ నెస్ డోస్ గట్టిగానే కనిపిస్తోంది. దీంతో వేడికే వేడి పుట్టించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video

అత్యదిక రెమ్యునరేషన్
కోలీవుడ్ స్టార్ విజయ్ 65వ సినిమాను నెల్సన్ దిలిప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదట ఈ సినిమా కొంతమంది బాలీవుడ్ బ్యూటీలను అనుకున్నప్పటికి ఫైనల్ గా పూజానే సెలెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం అమ్మడు ఏకంగా రూ.3 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు సమాచారం. పూజా కెరీర్ లో ఇదే అత్యదిక రెమ్యునరేషన్. ఇక చేతిలో ఉన్న రాధేశ్యామ్ విడుదలైతే ఆ రేటు ఫ్యూచర్ లో మరింత ఎక్కువ కావచ్చు.


Click it and Unblock the Notifications











