twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందంతో ఎటాక్ చేస్తున్న ‘పంజా’ బ్యూటీ, గోవాలో ఎంజాయ్ చేస్తూ...

    |

    సారా జేన్ డియాస్... ఈ పేరు విని చాలా కాలం అయింది కదూ! తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ... గుర్తింపు మాత్రం ఓ రేంజిలో వచ్చింది. అందుకు కారణం ఆమె యాక్టింగ్ టాలెంట్ ఎంత మాత్రం కాదు. తన హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో పాటు, రిలీజ్ ముందు భారీగా హైప్ రావడంతో పాటు రిలీజ్ తర్వాత భారీ ఫ్లాఫ్‌గా మిగిలిన పవన్ కళ్యాణ్ 'పంజా'లో హీరోయిన్‌గా నటించడమే ఇందుకు కారణం.

    'పంజా' ఇచ్చిన షాక్‌తో ఆమె మళ్లీ తెలుగు సినిమాల్లో ప్రయత్నించలేదు. ప్లాప్ హీరోయిన్‌గా ముద్ర పడటంతో ఆమెతో సినిమాలు చేసే సాహసం కూడా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరూ చేయలేదు. సినిమాలు లేక పోయినా తన గ్లామర్ ప్రదర్శనతో సారా జేన్ డియాస్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

    బికినీ ఫోటోలతో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తోంది

    బికినీ ఫోటోలతో ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తోంది

    ప్రస్తుతం సారా జేన్ డియాస్ గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడి సముద్రం ఒడ్డున బికినీలో సేదతీరుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. నటిగా ఆమెను ఆరాధించే వారి సంఖ్య అసలు లేక పోయినా... ఆమె అందాన్ని ఆరాధించే నెటిజన్ల సంఖ్య ఎక్కువే. ఆమె ఈ పిక్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది అభిమానులు రియాక్ట్ అయ్యారు.

    సినిమాల్లో కంటే ఫ్యాషన్ సర్క్యూట్లోనే బిజీ బిజీ

    సినిమాల్లో కంటే ఫ్యాషన్ సర్క్యూట్లోనే బిజీ బిజీ

    సారా జేన్ డియాస్ సినిమాల్లో కంటే ఫ్యాషన్ సర్క్యూట్లలోనే ఎక్కువగా బిజీగా గడుపుతున్నారు. బేసిగ్గా మోడల్ కావడం, అందులో టాప్ లెవల్ బ్యూటీ కావడంతో ఆమెకు డిమాండ్ ఎక్కువే. కలర్ తక్కువైనా మెస్మరైజ్ చేసే ఫిజిక్ ఆమె సొంతం.

    అంతంత మాత్రంగానే సినిమా కెరీర్

    అంతంత మాత్రంగానే సినిమా కెరీర్

    మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎంటరై హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకుందామని 2010లో తమిళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సారా జేన్ డియాస్‌కు తొలి నుంచీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెలుగులో ‘పంజా' పెద్ద ప్లాప్ అయింది. హిందీలో కొన్ని చిత్రాలు చేసిన పెద్దగా పేరు తేలేదు.

    సారా జేన్ డియాస్

    సారా జేన్ డియాస్

    ఇటు టాప్ మోడల్‌గా కెరీర్ కొనసాగిస్తూ... నటిగా వచ్చే చిన్న చిన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ సారా జేన్ డియాస్ ముందుకు సాగుతోంది. అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, వూట్ లాంటి ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాంలో ప్రసారం అయిన పలు వెబ్ సిరీస్‌లలో సైతం సారా జేన్ డియాస్ నటించారు.

    English summary
    Sarah Jane Dias recently posted a picture in which she is sporting a two-piece-bikini and chilling on the Goa beach. She is looking stunningly hot. Sarah-Jane Dias is an Indian actress, host, VJ and former beauty queen. She was the winner of Femina Miss India 2007.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X