భర్తకు గుడ్‌బై చెప్పిన పింక్ హీరోయిన్.. ఐదేళ్ల వైవాహిక జీవితం ముగింపు అంటూ ఎమోషనల్ పోస్ట్
పింక్ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కృతి కొల్హారి దంపతులు షాకింగ్ నిర్ణయం తీసుకొన్నారు. వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా ఈ స్టార్ దంపతులు తమ వైవాహిక జీవితానికి గుడ్ చెప్పారు. ఐదేళ్ల దాంపత్య జీవితాన్ని ముగించాలని ఈ కపుల్ నిర్ణయం తీసుకోవడం స్నేహితులు, సన్నిహితులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

నేను, నా భర్త విడిపోవాలని...
భర్త సాహిల్ సెహగల్, నేను విడిపోవాలని నిర్ణయించుకొన్నామంటూ కృతి కుల్హారి సోషల్ మీడియాలో పోస్టును పెట్టారు. నేను నా భర్త విడిపోవాలని నిర్ణయించుకొన్నామని చెప్పడానికి ఈ చిన్న మెసేజ్ పెడుతున్నాను. కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం లేదు. కానీ జీవితంలో వేరుగా ఉండాలని నిర్ణయించుకొన్నాం అని కృతి కొల్హారి తెలిపారు.

దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పడం
ఐదేళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పడం చాలా కష్టమైన విషయంగానే ఉంది. మా నిర్ణయం కొందర్ని బాధించవచ్చు. ఇది బాధకరమైన నిర్ణయమైన నాకు తెలుసు. కానీ విడిపోవాలని డిసైడ్ అయినాం. కాబట్టి ఈ నిర్ణయంలో వెనుక వెళ్లే అవకాశం లేదు అంటూ కృతి కొల్హారి పేర్కొన్నారు.

జీవితంలో కఠినమైన నిర్ణయం
నన్ను ఇష్టపడేవాళ్లు, నా గురించి ఆలోచించే శ్రేయోభిలాషులకు ఒక్కటే చెప్పదలచుకొన్నాను. నేను సేఫ్ ప్లేస్‌లోనే ఉన్నాను. ఆ తర్వాతే జీవితంలో కఠినమైన నిర్ణయం తీసుకొన్నాను. జీవితంలో ఎగుడు దిగుడులు ఉండటం సర్వసాధారణం. కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతుంటాయి అని పింక్ యాక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు.

పింక్ చిత్రంలో.. ఫిలింఫేర్ అవార్డు
హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రలో కృతి కొల్హారి కనిపించారు. ఆమె ఫలక్ అలీ అనే పాత్రలో నటించి మెప్పించారు. ఆమెకు గతంలో ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. 2016లో సాహిల్ సైగల్‌ను వివాహం చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











