భర్తకు పింక్ హీరోయిన్ విడాకులు.. అలాంటి వ్యక్తితో సహ జీవనం చేస్తా అంటూ..
బాలీవుడ్‌లో తనదైన శైలిలో రాణిస్తున్న వర్థమాన తార కృతి కుల్హారీ తన దాంపత్య జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భర్తతో సాహిల్ సెహగల్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత వివాహ వ్యవస్థపై చేసిన కామెంట్ల వైరల్‌గా మారాయి.
కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పెళ్లి అనేది సమాజంలో ఓవర్ రేటెడ్ ఫీలింగ్ అని అన్నారు. లవ్, సహజీవనం చేయడం ఓవరేటెడ్ అని అనలేను కానీ మ్యారేజ్ అనే కాన్సెప్ మాత్రం అతిగా ఊహించుకొంటారని అన్నారు. నేను ఎవరితోనైనా ప్రేమలో పడొచ్చు. అలాగే బ్యూటీఫుల్ రిలేషన్ షిప్‌ను కొనసాగించవచ్చు. కానీ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొంటే అలాంటి ఫీలింగ్స్ ఉండటం కష్టం. ఆ బంధం వల్ల చాలా కట్టుబాట్లు ఉంటాయి అని కృతి కుల్హారి అన్నారు.

సమాజంలో పెళ్లి అనే కాన్సెప్ట్‌కు పెద్ద విలువ ఉంది. సామాజిక కట్టుబాట్లకు పెళ్లి అనేది కీలకం. కానీ పెళ్లి అనే పదాన్ని కంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. పెళ్లి అనేది ఇద్దరి మనుషులనే కాదు.. రెండు హృదయాలను కలుపుతుంది అనేది నా భావన అని కృతి కుల్హారి పేర్కొన్నారు.
అయితే పెళ్లి రెండు ఫ్యామిలీ కలుపుతాయంటే ఒప్పుకొను. నా అనుభవం దృష్టి నేను రియలైజ్ అయిన విషయాన్ని చెబుతున్నాను. అందుకు సారీ. నాకు ఎదురైన అనుభవాల కారణంగా పెళ్లి అని ముడిపెట్టకుండా నా భాగస్వామితో జీవితం గడపాలని అనుకొంటున్నాను అ కృతి కుల్హారి క్లారిటీ ఇచ్చారు.
కృతి కుల్హారి కెరీర్ విషయానికి వస్తే.. కిచిడి: ది మూవీ అనే చిత్రంలో నటించారు. అలాగే సైతాన్, పింక్, యూరీ: ది సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











