డబ్బు రాగానే ముఖం చాటేసింది.. వరలక్ష్మీ శరత్ కుమార్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌పై దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పోలీస్ కంప్లైంట్ సినిమాలో వరలక్ష్మీ, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. జూన్ 12న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో సంజీవ్ మాట్లాడుతూ.. వరలక్ష్మీ తమకు ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం సహకరించలేదని ఆరోపించారు. ఈ వివరాల్లోకి వెళితే..

నా కథను నమ్మి, నన్ను నమ్మి నిర్మాతలు ఇన్వెస్ట్ చేశారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్ చేస్తే బాగుంటుందని చెబితే.. నిర్మాతలు ఎస్ చెప్పారు. చాలామంది వరలక్ష్మీ చాలా కోపరేటివ్ అని కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు. టైంకి ఫస్ట్ షాట్ తీయకపోతే ఫీల్ అవుతారని.. లేడీ బాలయ్య అని చెప్పారు. లేడీస్‌లో అంతటి క్రమశిక్షణ ఉండటం చాలా సంతోషకరం. బాలయ్య జన్మదినం సందర్భంగా ఈ లేడీ బాలయ్య గురించి చెప్పాలి.. లేడీ బాలయ్య అయితే కరెక్ట్‌గా 9 గంటలకి షార్ట్ అంటే 8.55కి వచ్చి కోపరేట్ చేశారు. ఆవిడ ఇంత వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌ని పోలీస్ కంప్లైంట్‌లో చేశారని సంజీవ్ తెలిపారు.

Police Complaint Director Sanjeev Megoti Makes Sensational Allegations Against Varalaxmi Sarathkumar

52 మంది ఆర్టిస్టులతో పాటు కొన్ని వందల మంది టెక్నీషియన్స్, వందల మంది జూనియర్ ఆర్టిస్టుల కష్టం ఈ సినిమాలో ఉంది. ఇంతమంది ఆర్టిస్టులతో 48 రోజుల్లో సినిమాను ఫినిష్ చేయడం ఒకటి, ఆ తర్వాత ఒకరోజు 24 గంటలు వర్క్ చేశాం. ఆ వెంటనే మళ్లీ అదే రోజు మధ్యాహ్నం షూటింగ్ స్టార్ట్ చేశాం. వీళ్లందరినీ మోస్తూ సినిమా చేసినా ఎలాంటి బాధ అనిపించలేదు. సినిమా చాలా బాగా వచ్చింది, కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అయితే వరలక్ష్మీగారిని ప్రమోషన్ విషయంలో సపోర్ట్ చేయమని అడిగాం. వరలక్ష్మీ గారు ప్రెస్‌మీట్‌లో కనిపించడం లేదని మీడియా వాళ్లు అడిగారు... గెస్ట్ రోల్ ఏమైనా చేస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. 2 గంటల 20 నిమిషాల సినిమాలో 2 గంటలు ఆవిడే ఉంది. ఆవిడే హీరో, ఆవిడ తర్వాతే ఎవరైనా అని సంజీవ్ తెలిపారు.

వరలక్ష్మీ గారు లక్షలు లక్షలు డబ్బులు తీసుకున్నారు. ప్రెస్‌మీట్‌కి వస్తే 30 వేలు నుంచి 40 వేలు తీసుకుంటారు. నిర్మాతల కష్టం ఆవిడకి కూడా తెలుసు.. మా సినిమా ఫస్టాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకు డబ్బింగ్ రాకుండా ఏడిపించారు. సెకండాఫ్ చెప్పడానికి 3 నెలలు పట్టింది. ఈ లోపు ఆవిడ సరస్వతిని డైరెక్ట్ చేసి రిలీజ్ చేసేశారు. ఆవిడది సినిమా.. మాది సినిమా కాదా? ఆవిడ వయసు 42 ఏళ్లు.. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆమెకు పదేళ్ల వయసు ఉండొచ్చు. అన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా అలాంటి వాళ్లని అడుక్కోవడం, మొన్న కూడా ప్లీజ్ అమ్మా రండి అని అడుక్కున్నా. నాకు టైం లేదు.. నేడు ఉండనని అంది. మరి డబ్బులు తీసుకున్నారు కదా? అని సంజీవ్ ప్రశ్నించారు.

ఫస్టాఫ్ డబ్బింగ్ చెప్పాక 3 నెలలు ఆపారు. ఆ తర్వాత అడిగితే వేరే వాళ్లతో చెప్పించుకోమన్నారు. షూటింగ్‌లో ఆమెకు చేయి విరిగితే 2 నెలలు షూటింగ్ ఆపాం. కట్టుకుని షూటింగ్ చేస్తే నేనే కథ మార్చుకుని కొన్ని సీన్లలో చేయి విరిగినట్లు చేశాం. ఆమె చేయి విరిగినప్పుడు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకే, ప్రొడ్యూసర్‌ గారిని నష్టపరుస్తూ షూటింగ్ చేశా. ఈ సినిమాలో చిన్న సీన్ చేసిన ప్రీతి వర్మ ముంబై నుంచి వచ్చింది. పదేళ్లు కూడా లేని చిన్నపిల్ల కూడా 24 గంటలూ వర్క్ చేసింది, ప్రమోషన్స్‌కి కూడా వచ్చింది. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ గారు ప్రతి ప్రమోషన్‌లోనూ పాల్గొన్నారు. సింగీతం శ్రీనివాసరావు గారు 94 ఏళ్ల వయసులో మీడియా ముందుకు వచ్చి ఆయన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. మరి వరలక్ష్మీ ఎందుకు రాదు.. వాళ్ల మేనేజర్ కూడా ఆన్సర్ ఇవ్వడు. డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రం ప్రతిరోజూ ఫోన్ చేసి అడిగేవాడు. డబ్బింగ్ చెప్పడానికి పక్క సందులో నుంచి మెయిన్ రోడ్‌లోకి రావడానికి 4 వేలు ఖర్చు అవుతుందని అనేవాళ్లు. కానీ పోలీస్ కంప్లైంట్ అనే సినిమా మీకు జీవితాన్ని ఇస్తుంది. మీరు ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల మా లాంటి దర్శకులకు నిర్మాతలకు జీవితాన్ని పొగొడుతుందని సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు రోజులు ప్రమోట్ చేయాలని ముందే మాట్లాడుకున్నాం.. కానీ ఒక గంటైనా రమ్మని అడిగా. ఆవిడ వచ్చుంటే మాకు కోటి రూపాయలు వచ్చేది.. రాకపోవడం వల్ల ఆ మొత్తం నష్టపోయాం. మా ఊరికి చెందిన ఓ పెద్ద నిర్మాత దగ్గరికి వెళితే ఆయన బాధ చెప్పుకున్నారు. వరలక్ష్మీకి ఎందుకు అంత హైప్ ఇచ్చావు.. నేను కూడా ఆమెతో 15 రోజులు షూటింగ్ చేసి పక్కన పడేశానని చెప్పారు. ఆ మాటలు నేను పట్టించుకోలేను. ఆవిడతో చేయించుకున్న అగ్రిమెంటే పేపర్ యాడ్. బయట కూడా నటిస్తుందని తెలిస్తే పెట్టుకునే వాళ్లం కాదు. నిర్మాత రాలేదు కాబట్టి ప్రమోషన్‌కి రాలేదు అనుకోవచ్చు. కానీ ప్రతి రూపాయి నిర్మాత ఇచ్చాడు.. చివరికి టీడీఎస్‌లతో సహా తీసుకున్నారు. రోజుకు 50 వేల రూపాయల్ని వరలక్ష్మీ స్టాఫ్‌కి ఇచ్చాం. దాదాపు 75 లక్షల రూపాయల్ని రెమ్యునరేషన్ కింద ఇచ్చాం. 5 రోజులు ప్రమోషన్‌కి వస్తానని సంతకం పెట్టారు. కానీ ఒకే ఒక్కరోజు అది కూడా 40 నిమిషాలు వస్తానని చెబుతున్నారు అని సంజీవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. మరి దీనికి వరలక్ష్మీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X