మిస్ ఇండియా పోటీలు పెద్ద మాఫియా.. పొలిమేర బ్యూటీ కామాక్షి భాస్కరాల షాకింగ్ కామెంట్లు!
మా ఊరి పొలిమేర నటి కామాక్షి భాస్కరాల గురించి అందరికీ తెలిసిందే. 2022లోనే ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మా ఊరి పొలిమేర, రౌడీ బాయ్స్, కబూల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి అనేక చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఏడాది విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 సినిమాల్లో కనిపించి అందరినీ మెస్మరైజే చేసింది. అయితే ముందుగా డాక్టర్ గా పని చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మోడల్ గా మెరిసి ఆపై సినిమా రంగంలోకి వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మిస్ ఇండియా పోటీలపై షాకింగ్ కామెంట్లు చేసింది. ఎందుకలా చేసిందో, ఏం మాట్లాడిందో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో ఆస్పత్రిలో కొంతకాలం డాక్టరుగా పనిచేసింది. ఆ తరువాత ఆమె మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. అయితే ఈమె వైద్యురాలు కాగా తాను ఏది చెప్పినా తాను ఏదైమా మంచి చేయాలనుకున్నా తాను చెప్పేదంతా వినాలంటే తాను ఓ స్టార్ కావాలని అనుకుని మాడలింగ్ రంగంలోకి అడుగు పెట్టినట్లు చెప్పింది. అలాగే తనకు ఏమీ తెలియకపోయినా.. యూట్యూబ్ లో పలు వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తూ.. మోడలింగ్ గురించి తెలుసుకున్నట్లు కూడా వెల్లడించింది.

అలాగే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి తాను పడ్డ కష్టాన్ని అంతా వివరించింది. తాను మోడల్ గా చేస్తానని చెబితే తండ్రి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పారట. ఇంత కష్టపడి చదివిస్తే మరేదో చేయడాన్ని తాను ఒప్పుకోలేదని.. దీంతో ఆమె తన సాయంత్రం ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేయాలని ఫిక్స్ అయి ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు పడే కష్టం గురించి వివరించింది. అయితే అంతా కష్టపడి తాను మిస్ ఇండియా ఫైనల్స్ కు చేరుకోగా.. టాప్ 3లో నిలిచానని చెప్పుకొచ్చింది. కానీ టాప్ 1లోకి వచ్చేందుకు తాను ఇంకా చాలా సన్నబడాలని ఓ జడ్డి చెప్పినట్లు తెలిపింది.
కానీ తనకు అది నచ్చలేదని.. నిజానికి తన హైట్ కు తన వెయిట్ కరెక్ట్ అని.. ఇతర దేశాల వాళ్లతో తన బాడీ మ్యాచ్ కాదని చెప్పుకొచ్చింది. ఆమె అలా చెప్పగానే.. తనకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయిందని... బ్యూటీ అంటే మనలోని అందాన్ని మెరుగు పరిచి చూయించాలే తప్ప ఏవేవో సర్జరీలు, హెల్త్ పాడు చేసుకోవడం వంటివి తనకు నచ్చలేవని చెప్పింది. అలాగే అన్ రియలిస్టిక్ గా ఏది చేసినా అది తనకు సరిగ్గా అనిపించదని.. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో తనపై చాలా మంది కోపం పెంచుకున్నారని వివరించింది.

మిస్ ఇండియా పోటీలు నిజానికి ఓ పెద్ద మాఫియా అని.. అలాంటి వాటిల్లోకి తాను వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు కామాక్షి భాస్కరాల వివరించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అన్నీ క్యారెక్టర్లను తాను చేస్తానని కామాక్షి వివరించింది.


Click it and Unblock the Notifications











