నాగ్ హీరోయిన్ రొమాన్స్ జోరు.. నడిరోడ్డుపైనే ‘రేర్ కిస్’తో హంగామా!
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో పలువురు అగ్రహీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ పూజా బాత్రా ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నటిగా కాస్త రిలాక్స్ అవుతున్న ఈ భామ యోగా మాస్టర్‌గా ఇప్పుడు బిజీగా మారారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులకు ఉత్సాహ పరుస్తుంటారు. తాజాగా రొమాంటిక్ మూమెంట్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ ఫోటో గురించిన కథ ఏమిటంటే..

మిస్ ఇండియాగా టాలీవుడ్‌లోకి
మిస్ ఇండియాగా పూజా బాత్రా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఏకంగా మన్మథుడు నాగార్జునతోనే సిసింద్రీలో ఓ పాటలో మెరిసారు. ఆ తర్వాత దర్శక రత్న దాసరి తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన గ్రీక్ వీరుడు చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, మలయాళ, హిందీ రంగంలో బిజీగా మారిపోయారు.

బాలీవుడ్‌లో బిజీగా ఉండగానే..
హిందీ సినిమా రంగంలో బిజీగా ఉంటుండగానే సోను ఎస్ అహ్లువాలియాను వివాహం చేసుకొన్నారు. 2002 నుంచి 2011 వరకు పూజా బాత్రా వివాహం సాఫీగా జరిగిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత నటుడు నవాబ్ షాతో సహజ జీవనం చేస్తున్నారు.

ప్రియుడు నవాబ్ షాతో హాట్ ఫోటోలు
ఇటీవల కాలంలో నవాబ్ షోతో రొమాంటిక్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్నారు. వారిద్దరి హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె రొమాన్స్ గురించి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

కొలంబియా పర్యటనలో రేర్ ముద్దు
తాజాగా పూజా బాత్రా కొలంబియాలోని ఓ జంతువును ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను షేర్ చేయగా వైరల్ అయింది. లామా అనే ఓ జంతువును రోడ్డుపైనే ముద్దు పెట్టుకొంటూ కనిపించారు. ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రేర్ కిస్ అంటూ కాప్షన్ పెట్టారు. ఈ ఫోటోపై భారీగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video

కొలంబియా విహార యాత్రలో
కొలంబియా విహార యాత్రకు వెళ్లిన తాను లామాను ముద్దు పెట్టుకొంటూ సాహసం చేశాను. కృష్ణ తంగవేలు నాతో విహార యాత్రకు వచ్చారు. మేమద్దరం ఈ పర్యటనలో ఫుల్లుగా ఎంజాయ్ చేశాం. చాలా వినోదాన్ని పంచుకొన్నాం అంటూ తన పర్యటనకు తాలుకు మెమొరీస్‌ను పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











