Don't Miss!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
సంక్రాంతికి దిగిపోతున్న బుట్టబొమ్మ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి లక్ కలసి వచ్చేనా!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరా అంటే ఠక్కున బుట్టబొమ్మ, అదేనండి మన పూజా హెగ్డే పేరునే చెప్పేస్తారు. అంతగా తన అందచందాలతో మురిపిస్తున్న ఈ కన్నడ కస్తూరి ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ ల్లో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మొదలైన అమ్మడి ఊపు వచ్చే వచ్చే సంక్రాంతి వరకూ కొనసాగబోతోందని అంచనా వేస్తున్నారు సినీజనం.
అల వైకుంఠపురంలో సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజ, దీంతో పాటే అందరికీ హాట్ ఫేవరేట్ గానూ మారిపోయింది. అందుకే లాక్ డౌన్ లోనూ పలు క్రేజ్ ప్రాజెక్ట్ లు అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేశాయి. ప్రస్తుతం అమ్మడు నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాథేశ్యామ్, వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి.
ఇందులో అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతికే వచ్చేసేందుకు రెడీ అయిపోతోంది. డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసేసి పెద్ద పండగకు ప్రేక్షకులకు వినోదం పంచాలని చిత్ర బృందం పరితపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ డ్రామాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఫ్యూజులు ఎగరగొట్టేసిన భాస్కర్, పూజ అందాలను ఏ విధంగా ఆవిష్కరించాడా అన్న కుతూహలం కూడా మొదలైంది.
మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కు జోడీగా పూజ నటించిన రాథే శ్యామ్ సైతం సెప్టెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలోనూ పూజ పాత్ర విభిన్నంగా ఉండబోతోంది తెలుస్తోంది. ఇక త్వరితగతిన షూటింగ్ పూర్తిచేసి 2021 వేసవి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఆసక్తికరమైన సినిమాలతో జనాలను ఊరిస్తున్న పూజా హెగ్డే ఈ అంచనాలను ఎంతవరకూ నిలబెట్టుకుంటుందో చూడాలి.