మరో బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న బ్యూటీ పూజా హెగ్డే. అసలు ఆమె ఈ రేంజ్ లో బడా హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఫామ్ లో లేకపోవడం కూడా పూజకు బాగా కలిసొచ్చింది. అయితే చాలా రోజుల తరువాత మరో బిగ్ బడ్జెట్ సినిమాకు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
పూజా ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆ పాన్ ఇండియా సినిమా హిట్టయితే అమ్మడి రేంజ్ మరో లెవెల్ కు వెళ్లడం కాయం. ఇక బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ అందుకుంటోంది. అలాగే అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ క్లిక్కయినా కూడా బోనస్ అనే చెప్పాలి. ఇక త్వరలో కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేసింది.

ఇటివల ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది. మాస్టర్ సినిమా అనంతరం విజయ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక పూజా అందులో మెయిన్ హీరోయిన్ గా కనిపించడానికి రెడీ కానుంది. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. అలాగే సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న ఈ బ్యూటీ చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్ కూడా రెండు కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











