twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన రిలేషన్ ఎప్పుడు అనౌన్స్ చేద్దామన్న నెటిజన్.. దిమ్మతిరిగే షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన పూజా హెగ్డే!

    |

    పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లోనే కాక దాదాపు అన్ని బాషలలో బిజీబిజీగా సినిమాలు చేస్తోంది. మెయిన్ బేస్ గా టాలీవుడ్ ను చేసుకున్న ఈ భామ ఒక పక్క తమిళం, మరో పక్క హిందీ సినిమాలు కూడా చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె తాజాగా అభిమానులతో ముచ్చటించగా ఆ సమయంలో ఆసక్తికర కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    బిజీ హీరోయిన్

    బిజీ హీరోయిన్

    స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన పూజాకు సాలు ఏమాత్రం టైమ్ దొర‌కడం లేద‌ని.. త‌నతో ఫోన్లో మాట్లాడాల‌న్నా ఆమె డేట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇటీవ‌ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.

    ఆస్క్ పూజా అంటూ

    ఆస్క్ పూజా అంటూ

    ఇప్పటికి పూజాకి టైమ్ దొరికిందో లేక సోష‌ల్ మీడియాలో త‌న ఫాలోవ‌ర్స్ తో మాట్లాడాలి అనిపించిందో తెలీదు కానీ నిన్న ఆస్క్ పూజా అంటూ ప్ర‌శ్న‌లు అడ‌గ‌మంది. పూజా అలా అడగమంటే అభిమానులు ఆగుతారా? ఆస్క్ పూజా హెగ్డే పేరిట హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తూ అభిమానులు రకరకాల ప్రశ్నలు సంధించారు. పూజా హెగ్డే కూడా తనకు ఈజీగా ఉన్న సమాధానాలు చెప్పుకొచ్చింది.

    గర్వ పడే స్టార్

    గర్వ పడే స్టార్

    ముందుగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం గురించి అడగగా.. అది పీరియాడిక్ లవ్ స్టోరీ.. చాలా గొప్పగా ఉంటుంది. అద్భుతమైన‌ విజువల్స్ తో ఉంటుంద‌ని చెప్పింది. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరితే స్వీటెస్ట్ అని.. క‌న్న‌డ స్టార్ హీరో యశ్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగితే అడగగా కన్నడ సినీ పరిశ్రమ గర్వ పడే స్టార్ అని చెప్పింది.

    ఎన్టీఆర్ రియల్

    ఎన్టీఆర్ రియల్

    అలాగే ఎన్టీఆర్ గురించి ఒక్కమాటలో చెప్పమని అడిగితే రియల్ అని పేర్కొంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో న‌టించారు క‌దా ఎలా ఫీల‌వుతున్నారు అని అడిగితే.. 'ఆచార్య గురించి ఇప్పుడు ఏమీ చెప్ప‌లేను కానీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చూసి చిరంజీవి గారు నీ నటన బాగుంది. చాలా బాగా న‌టించావ్ అని మెచ్చుకున్నారు. చిరంజీవి గారు అలా చెప్ప‌డం.. మరింత కష్టపడి పని చేయడానికి స్ఫూర్తినిచ్చింది' అంటూ చెప్పుకొచ్చింది పూజ.

    నోరు మూయించింది

    నోరు మూయించింది

    ఇదే సమయంలో పూజా హెగ్డేను ఒక అభిమాని ఇబ్బందికర ప్రశ్న అడిగాడు. పూజా హెగ్డే ఏమన్నా మామూలుదా? ఆమె కూడా అతని కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆ అభిమాని పూజ హెగ్డే ని అడిగిన ప్రశ్న ఏమిటంటే, మన రిలేషన్ షిప్ ని ఎప్పుడు పబ్లిక్ గా అనౌన్స్ చేద్దాము అని ప్రశ్నించాడు.. దానికి పూజా హెగ్డే స్పందిస్తూ రక్షా బంధన్ రోజున అంటే రాఖీ పండుగ రోజు చేద్దాం అని చెప్పుకొచ్చింది.

    అతను పూజా హెగ్డేని తన ప్రేయసి లాగా ఫీల్ అయ్యి ఎక్కువ మాట్లాడితే, నువ్వు సోదరుడి లాంటి వాడివి అంటూ ఆమె అతని నోరు మూయించడం ఆసక్తికరంగా మారింది.

    English summary
    Pooja Hedge gave a befitting reply to Netizen over Relationship.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X