బుట్టబొమ్మ పోజు మామూలుగా లేదు.. కోట్లాది మంది ప్రేమను వయ్యారాలతో అందంగా చూపిస్తూ..
పూజా హెగ్డే అంటే ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు. సౌత్ ఇండస్ట్రీలో అమ్మడు అత్యదికంగా క్రేజ్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్ గా ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది. బుట్టబొమ్మ ఫాలోవర్స్ సంఖ్య ఏ స్థాయిలో ఉందొ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఇంత అంటూ కాళ్లతో అందంగా ప్రజెంట్ చేసింది.

అప్పటి నుంచి క్రేజ్ పెరుగుతూనే ఉంది
కెరీర్ మొదట్లో వరుస అపజయాల కారణంగా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే కొంత ఇబ్బందులు పడింది. ఇక ఎప్పుడైతే గ్లామర్ డోస్ పెంచి బికినీలో దర్శనమిచ్చిందో అప్పటి నుంచి ఆమె రేంజ్ పెరుగుతూనే ఉంది. దువ్వడా జగన్నాథమ్ సినిమా నుంచి పెద్ద సినిమాల్లో చాలా ఈజీగా అవకాశాలు అందుకుంటోంది.

కోటి మందికి పైగా..
ఆ తరువాత అరవింద సమేత, మహర్షి, అల..వైకుంఠపురములో సినిమాలు కూడా
హిట్టవ్వడంతో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ అందుకొని విధంగా అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ లో కోటి మందికి పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 11 మిలియన్స్ కి చేరింది.

వయ్యారాలతో..
11 మిలియన్స్ ఫాలోవర్స్ అయిన సందర్భంగా పూజా హెగ్డె విచిత్రమైన పోజు ఇచ్చింది. తలక్రిందులుగా కాళ్లతో 11 అనే సంఖ్యను చూపించి నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. తనపై ఈ స్థాయిలో ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలని పూజా హెగ్డే ఒక వివరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండు సినిమాలతో బిజీగా..
ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ రాధే శ్యామ్ తో పాటు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో హౌజ్ ఫుల్ తో బాక్సాఫీస్ సక్సెస్ కొట్టిన పూజా ఆ తరువాత ఆఫర్స్ చాలానే వచ్చినా కథలు నచ్చక ఒప్పుకోలేదట. బాలీవుడ్ లో వీలైనంత వరకు మంచి పాత్రల్లో సక్సెస్ అవ్వాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications











