ఆ విషయం నాకు అర్థమవ్వడం లేదు.. పూజా హెగ్డే కామెంట్స్
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే టాలీవుడ్‌లో వచ్చిన స్టార్డంతో పూజా హెగ్డే ఇప్పుడు జాతీయ స్థాయిలో దుమ్ములేపుతోంది. బాలీవుడ్ పూజా హెగ్డేకు అంతగా కలిసి రాలేదు. కానీ టాలీవుడ్ మాత్రం పూజా హెగ్డేను స్టార్ హీరోయిన్‌ను చేసింది. అలా ఇప్పుడు పూజా హెగ్డే మొత్తం సౌత్ మీద కన్నేసింది. ఈ మధ్యే కోలీవుడ్ ప్రాజెక్ట్‌లోకి పూజా హెగ్డే అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఇళయ దళపతి విజయ్ 65వ చిత్రం భారీ ఎత్తున రాబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోందని అధికారికంగా ప్రకటించేశారు. అలా మొదటిసారిగా పూజా హెగ్డే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. పూజా హెగ్డే ప్రస్తుతం బ్యాచ్‌లర్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మొన్నీ మధ్యే పూజా హెగ్డే బ్యాచ్ లర్ చిత్రం గురించి ఓ పోస్ట్ చేసింది. చివరి రోజు షూటింగ్ అంటూ తాను చేసిన అల్లరి పనులను పూజా హెగ్డే పోస్ట్ చేసింది.

అయితే తాజాగా పూజా హెగ్డే తన జుట్టు మీద కామెంట్ చేసింది. ఈ రోజు అసలు జుట్టు బాగుందా? లేదా? అది నాకు అర్థం కావడం లేదంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. కాసేపటి క్రితమే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై కామెంట్ చేసింది. ఆచార్య చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తంగా మూడు సినిమాలతో పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.


Click it and Unblock the Notifications











